iDreamPost
android-app
ios-app

సీతక్కను సీఎం చేస్తాం… రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!

సీతక్కను సీఎం చేస్తాం… రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!

తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ  కాంగ్రెస్, బీజేపీలు వ్యూహలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీ.. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి.. ఎన్నికలకు సిద్ధమవుతుంది. అలానే వివిధ పార్టీల అధ్యక్షులు చేసే కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. తెలంగాణంలో కాంగ్రెస్ గెలిస్తే.. సీతక్క సీఎం చేస్తామంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలో జరిగినా తానా సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ పలు ఆసక్తికర కామెంట్స్  చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆయన స్పందించారు.  అమరావతి, పోలవరం తామే నిర్మిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేస్తారు.  తానా సభలోని వారు.. రేవంత్ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగారు. వాటికి  ఆయన తనదైన స్టైల్ లో సమాధానాలు ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారాన్ని చేపడితే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొంతమంది ఎన్నారైలు రేవంత్‌ను కోరారు.

దీనికి రేవంత్ సమాధానం చెప్తూ..  ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించదన్నారు. అవసమైతే పార్టీ సీతక్కన్ కూడా ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.  ఆరు  దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న దళిత నేత మల్లికార్జున ఖర్గే..ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు.  ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సీతక్కకు మంచి అనుబంధం ఉంది. తనకు సీతక్క సొంత చెల్లి లాంటిదని రేవంత్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

అలానే రేవంత్‌ను తాను సొంత అన్నలా భావిస్తానని అనేకసార్లు సీతక్క కూడా చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కకు కీలక పదవి ఇస్తామని రేవంత్ గతంలో బహిరంగంగానే వెల్లడించారు. సీతక్కును సీఎం చేస్తానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి. మరి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.