Dharani
Dharani
ప్రతి మనిషికి ఓ రోజు వస్తుంది అంటారు. అలానే ప్రతి జీవికి తన దైన ఒక రోజు వస్తంది. ఇప్పుడు ఇదే మాట టమాటాలకు వర్తిస్తుంది. ఒకప్పుడు టమాటా సాగు చేసిన రైతు.. మద్దతు ధర కాదు కదా.. కిలో రూపాయికి అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక.. తన ఆక్రోశాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక.. ఆరుగాలం శ్రమించి పండిన పంటను నడి రోడ్డు మీద వదిలేసి ఏడ్చుకుంటూ వెళ్లాడు. నాడు టమాటా అంటే అందరికి చిన్న చూపు. మరి ఇప్పుడు టమాటా కాలం నడుస్తోంది. అందుకే అప్పుడు రైతు చేత కంట తడి పెట్టించిన వారందరి మీద ఇప్పుడు అది ప్రతీకారం తీర్చుకుంటుంది. టమాటా ధర కొండెక్కి.. తనను నమ్ముకున్న రైతులను లక్షాధికారులు, కోటీశ్వరులను చేస్తుంది.. సామాన్యుల చేత కన్నీరు పెట్టిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధర కిలో 150-200 రూపాయలు పలుకుతుంది. పేద, మధ్యతరగతి జనాలు అసలు టమటా కొనడడమే మానేశారు. ఈమధ్య కాలంలో దేవవ్యాప్తంగా టమాటా ధర మీదనే జోరుగా చర్చ సాగుతోంది ఇక సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టమాటా ధర మీద ఓ రేంజ్‌లో మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో టమాటాల గురించి వచ్చిన కొన్ని వార్తలు చూసి జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. అవేంటో మీరు ఒకసారి చూడండి..
సాధారణంగా ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే.. వారి చేత మొబైల్స్, ల్యాప్‌టాప్, బంగారం, చాక్లెట్లు ఇలా రకరకాల వాటిని తెప్పించుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా టమాటాలు తీసుకువచ్చింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ తన తల్లికి బహుమతి ఇవ్వడం కోసం 10 కేజీల టమాటాలను తీసుకుని వచ్చి ఆమెను సర్ప్రైజ్ చేసింది. దుబాయ్ నుంచి టమాటాలు తీసుకురావడం మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
సాధారణంగా ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే.. అన్నదానం వంటివి చేస్తారు. కొందరు పేదలకు, అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి అన్నదానం, బట్టలు, పండ్లు వంటివి పంపిణీ చేస్తారు. కానీ ఓ తండ్రి మాత్రం ఇందుకు భిన్నమైన పని చేసి వార్తల్లో నిలిచాడు. టమాటా ధరలు పెరగడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. దాంతో తన కుమార్తె బర్త్‌డే రోజున వెరైటీగా జనాలకు టమాటాలు పంచి.. తన మంచి మనసు చాటుకున్నాడు ఆ తండ్రి.
సాధారణంగా ఆలయాల్లో బంగారం, డబ్బులు, కొబ్బరి కాయలు వంటి వాటితో తులాభారం వేస్తారు. మేడారం జాతరలో అయితే బంగారం అంటే బెల్లం సమర్పిస్తారు. కానీ ఏపీలోని ఓ ఆలయంలో మాత్రం ఇందకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. అనకాపల్లికి చెందిన ఓ తండ్రి స్థానిక నూకలమ్మ ఆలయంలో తన కుమార్తెకు తులాభారం నిర్వహించాడు. అయితే వెరైటీగా టమాటాలతో తులాభారం నిర్వహించాడు. దాంతో జనాలు.. వామ్మో మీరు చాలా రిచ్ గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో టమాటాలు అమ్మి కోటీశ్వరులైన రైతుల గురించి బోలేడు వార్తలు వచ్చాయి. అలానే టమాటాల దొంతగనం వార్తలు కూడా బోలేడు. ఏకంగా ఇంట్లో ఫ్రిజ్‌లో దాచిన టమాటాలు కూడా దొంగతనం చేశారు. ప్రస్తుతం అయితే నవంతుడు. అతడికే పలుకుబడి ఎక్కువ. ఇవన్ని చూస్తేంటే టమాటా క్రేజ్ చేస్తే మతి పోతుంది అనిపించక మానదు.