iDreamPost
iDreamPost
రాజధాని గ్రామమైన మందడంలో నిన్న ఓ ఉద్యోగి తన విధుల్లో భాగంగా శిబిరంలో దీక్షను , గ్రామంలో ఆందోళనలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తుండగా హఠాత్తుగా కొందరు వ్యక్తులు అతని పై దాడి చేసి డ్రోన్ ని లాక్కుని అతని పై దాడి చేసి మహిళలు టాప్ లెస్ బాత్రూంలలో స్నానం చేస్తుండగా , బట్టలు మార్చుకొంటుండగా పోలీసులు డ్రోన్ కెమెరాలతో అసభ్యంగా చిత్రించారని టీడీపీశ్రేణులు ఆరోపించాయి .
ఈ ఘటన పై టీవీ 5 చానెల్ లో జర్నలిస్ట్ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన డిబేట్ లో పాల్గొన్న టీడీపీ మహిళా స్పోక్స్ పర్సన్ పంచమర్తి అనురాధ మాట్లాడుతూ రాజధాని ప్రాంత మహిళలు ఆందోళనల్లో పాల్గొనకుండా , శిబిరాల్లో కూర్చోకుండా ఈ వీడియోలు చూపించి బెదిరించటానికే వీడియోలు తీశారని సంచలన ఆరోపణలు చేశారు .
అంతే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పేర్లు ఈ వివాదంలోకి లాగుతూ సభ్య సమాజం హర్షించని రీతిలో తీవ్ర అసభ్య వ్యాఖ్యలు చేశారు . ఇదే చర్చలో అనురాధ , టీవీ5 మూర్తి ఇరువురూ మాట్లాడుతూ పోలీసులు తీసిన వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు …..
సరే ఆ తర్వాత చర్చ ఎలా జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే అనురాధ ఆరోపణల్లో నిజమెంత , ఈ రోజుల్లో టాప్ లెస్ టాయిలెట్స్ ఉన్నాయా అనే కోణంలో పరిశీలించి చూద్దాం .
భారత జల మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం మందడం గ్రామంలో 2013 నాటికి 1421 ఇల్లు ఉండగా అందులో 1005 ఇళ్ళకి టాయిలెట్స్ ఉన్నాయని 416 ఇళ్ళకి టాయిలెట్స్ లేవని గుర్తించింది .
ఆ తర్వాత 2013-14 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర సహకారంతో 4 టాయిలెట్స్ నిర్మించగా , బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్ భారత్ పధకం ద్వారా 2014-2015లో 92 టాయిలెట్స్ , 2015-2016 లో 99 , 2016-2017లో 161 , 2017-2018లో 60 చొప్పున మొత్తం 416 టాయిలెట్స్ నిర్మించి , మరోసారి సర్వే నిర్వహించి టాయిలెట్స్ లేని ఇల్లు లేవని నిర్ధారించుకొని నూరు శాతం టాయిలెట్ సహిత స్వచ్ భారత్ గ్రామమని కేంద్ర ప్రభుత్వానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ చేసింది . అటు తర్వాత 2019 లో ఒక్క అప్లికేషన్ కూడా లేదు .
ఎన్టీఆర్ రూరల్ స్వగృహ కింద BPL కుటుంబాలేవైన కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అనుకున్నా బాత్రూం సహా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్రం దగ్గరుండి కట్టించింది కాబట్టి బాత్ రూమ్ లేని ఇల్లు ఉండే అవకాశం లేదు .
మరి టీడీపీ నేత అనురాధ చెప్తున్న టాప్ లెస్ బాత్రూమ్లు ఎక్కడినుండి వచ్చాయి?
ఈ మొత్తం వ్యవహారం మీద కొన్ని సమాధానం లేని ప్రశ్నలుతలెతుతున్నాయి..
1 . మందడం గ్రామంలో టాప్ లెస్ టాయిలెట్స్ లో మహిళలుండగా పోలీసులు డ్రోన్కెమెరాలతో వీడియో తీశారన్న ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా?ఉంటే పోలీస్ ఫిర్యాదు ఎందుకు చెయ్యటం లేదు? .
2 . అలా వీడియోస్ తీయమని ప్రభుత్వమే ఆదేశించిందని , ఆ వీడియోలతో ఆయా మహిళల్ని బ్లాక్ మెయిల్ చేసి రాజధాని పోరాటానికి , నిరసన శిబిరాలకు రాకుండా బ్లాక్ మెయిల్ చేయటానికన్న ఆరోపణకి ఆధారం ఉందా ?.
3 . మహిళల్ని ఎవరు కించపరిచినా , అసభ్యంగా చిత్రీకరించినా క్షమించరాని నేరమే , కానీ ఒక గ్రామంలో జరిగింది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సాక్ష్యాధారాలు లేని ఘటనకు ముఖ్యమంత్రి ఎలా భాద్యత వహించాలి?పోలీసు మీద నమ్మకం లేకుంటే ఆధారాలతో గవర్నర్ ను కలవటమో లేక నేరుగా హై కోర్టులో కేసు వెయ్యటంతో చెయ్యవచ్చు. .
4 . ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైన మహిళల్ని ఈ వివాదంలోకి లాగటం ఎందుకు?రాజధాని మహిళల సమస్యను రాజకీయం చెయ్యటం ఎందుకు?
5 . గతంలో సీఎం ఇంటి చుట్టుపక్కల గంజాయి అమ్ముతున్నారు అని ఓ మహిళ చేత కొందరు ఆరోపించగా , రెండో రోజే సదరు మహిళ నాకేం తెలియదు అనురాధ గారు ఎలా చెప్పమంటే అలా చెప్పాను అన్న వ్యాఖ్యలకు అనురాధ ఇప్పటికి స్పందించలేదు.
6 . అసలు ఆ గ్రామంలో టాయిలెట్ లేని ఇల్లు లేవని 100 శాతం స్వచ్ భారత్ మిషన్ లక్ష్యాన్ని సాధించిందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లోనే కేంద్రానికి రిపోర్ట్ చేస్తే ఈ రోజు టాప్లెస్ టాయిలెట్స్ ఎక్కడినుండి వచ్చాయి . చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు రికార్డ్స్ ఇచ్చిందా ? . లేక ఇలా ఆరోపించటానికి టీడీపీ కార్యకర్తల టాయిలెట్స్ రూఫ్స్ పగలగొట్టారా ? .
7 . అమరావతి రాజధాని అంశాన్ని టీడీపీ భుజానికెత్తుకొన్న నాటి నుండి ఇప్పటివరకూ టీడీపీ చేసిన పలు ఆరోపణలు అబద్ధం అని రుజువు అవుతూ వచ్చాయి , కొత్త ఆరోపణలైకన తగిన ఆధారాలు చూపి న్యాయపోరాటం చెయ్యాలి. టీవీ డిబేట్లతో ఉపయోగం ఉండదు. .
నిజమైన ప్రజా సమస్యలు గుర్తించటం , వాటి గురించి చర్చించటం , ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై పోరాడి ఒత్తిడితెచ్చి పని చేయించడం లాంటి ప్రతిపక్ష బాధ్యతలను టీడీపీ పూర్తిగా విస్మరించింది అని సీనియర్ రాజకీయ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
TDPకి కావాల్సింది ప్రజలు కాదు . బినామీల పేరిట పోగు చేసిన వందల ఎకరాలు భూములకు విలువ తగ్గకూడదు , వేల కోట్ల ఆదాయం ఉండాలి . అందుకోసం రాజధాని వికేంద్రీకరణ జరగకుండా అన్నీ అమరావతిలోనే కేంద్రీకృతం కావాలి .
టీడీపీ ఆశా ఆరాటం , కోరిక , పోరాటం అన్నీ అమరావతి లోనే ఉండాలి , అమరావతితోనే అన్నీ ముడిపడి ఉండాలి . అందుకోసం ఎం చేయడానికైనా , ఎంతకి తెగించడానికైనా టీడీపీ సిద్ధంగా ఉంది . ఆ క్రమంలోనే ఈ విలువలు లేని దిగజారుడు ఆరోపణలు అని ఇతర ప్రాంతాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు .