iDreamPost
android-app
ios-app

వారియర్ మీదే ఆశలన్నీ

  • Published Jul 09, 2022 | 5:13 PM Updated Updated Jul 09, 2022 | 5:13 PM
  • Published Jul 09, 2022 | 5:13 PMUpdated Jul 09, 2022 | 5:13 PM
వారియర్ మీదే ఆశలన్నీ

ఈ నెల 14న విడుదల కాబోతున్న ది వారియర్ మీద ట్రేడ్ భారీ నమ్మకం పెట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాక రామ్ చేసిన సినిమా రెడ్ ఒకటే. అది యావరేజ్ గా ఆడిందే తప్ప అభిమానుల అంచనాలు అందుకోలేదు. అందులోనూ తమిళ రీమేక్ కావడంతో దాని ఫలితం పట్ల రామ్ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ఈ వారియర్ ని ఒప్పుకున్నాడు.

బాక్సాఫీస్ వద్ద మాములు సినిమాలు ఆడటం లేదు. పక్కా కమర్షియల్ లాంటి సోసో కామెడీ, సమ్మతమే తరహా విసిగించే ప్రేమను, రాధే శ్యామ్ టైపు ఎపిక్ డిజాస్టర్ లవ్ స్టోరీస్ ని మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. విక్రమ్ అంత గొప్పగా ఆడిందంటే అందులో మాస్ మసాలా యాక్షన్ కంటెంటే కారణం. కెజిఎఫ్ 2 సక్సెస్ వెనుక ముందు కనిపించేది ఓవర్ ది బోర్డ్ హీరోయిజం ఎలివేషన్లేగా

అందుకే మాస్ ని మళ్ళీ థియేటర్ కు రప్పించే మెటీరియల్ ది వారియర్ లో ఉందనే టీమ్ నమ్ముతోంది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి గ్లామర్ ప్రధాన ఆకర్షణ కానుంది. తమిళంలోనూ పోటీ లేకుండా గ్రాండ్ రిలీజ్ అందుకుంటున్న వారియర్ లో సరైనోడు తర్వాత అంతకు మించిన విలనిజం ఆది పినిశెట్టి ఇందులో చూపించబోతున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet