iDreamPost
android-app
ios-app

Tollywood : నిర్మాతలు అలెర్ట్ గా లేకపోతే అంతే

  • Published Jan 02, 2022 | 5:01 AM Updated Updated Jan 02, 2022 | 5:01 AM
Tollywood : నిర్మాతలు అలెర్ట్ గా లేకపోతే అంతే

కాసేపు ఆర్ఆర్ఆర్ ని పక్కనపెడితే కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వైరస్ టాలీవుడ్ కు మరో సరికొత్త పాఠం నేర్పిస్తోంది. మన నిర్మాతలను హెచ్చరిస్తోంది. పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ ని లాక్ చేసుకున్నప్పుడు ఇతర చిత్రాలు దాని దరిదాపుల్లోకి వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడటం సహజం. అందులో తప్పేమి లేదు. కానీ ఒకవేళ వాటిని వాయిదా వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇతర నిర్మాతలు అలెర్ట్ గా ఉండి ఫస్ట్ కాపీలను ముందే రెడీగా ఉంచుకుంటే లక్కీగా దొరికిన డేట్లను వాడుకుని లాభ పడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆర్ఆర్ఆర్ స్థానంలో ఆ స్థాయి కాదు కదా కనీసం అందులో సగం క్రేజ్ ఉన్న సినిమా కూడా ఏదీ సిద్ధంగా లేకపోవడం మంచి సీజన్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కావొచ్చు లేదా సత్యదేవ్ గాడ్సే కావొచ్చు. ఇప్పటికిప్పుడు ఏదీ రెడీగా లేదు. అంతా హడావిడే. రిలీజ్ ఎప్పుడు చేస్తాం అనేదాని కన్నా వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసుకుని సెన్సార్ తో సహా అంతా కంప్లీట్ చేసుకుంటే అనూహ్యంగా కలిసి వచ్చే ఇలాంటి పరిణామాలు అనుకూలంగా వాడుకునే అవకాశం ఉంటుంది. యాభై శాతం ఆక్యుపెన్సీకి సైతం అంత భయపడాల్సిన పని లేదు. గత ఏడాది ఇదే టైంలో సగం సీట్లతోనే క్రాక్ బ్లాక్ బస్టర్ కావడం మర్చిపోకూడదు. మాస్టర్, రెడ్ లు సైతం సేఫ్ అయ్యాయి. అల్లుడు అదుర్స్ ఎంత డిజాస్టర్ అయినా ఎనిమిది కోట్ల దాకా వసూలు కావడం గుర్తుకు తెచ్చుకోవాలి.

ఏ నిర్మాతకైనా ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటున్నాయి. అయితే థియేటర్. లేదా ఓటిటి. నష్టమనే ప్రశ్నే లేకుండా ఏదోలా అమ్మేసుకునే ఛాన్స్ ఉంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మీడియం రేంజ్ మూవీస్ కి ఎక్కువ లాభం ఉంటుంది. డిజె టిల్లు, గల్లా అశోక్ హీరో లాంటివి ఇప్పుడు సంక్రాంతి రేస్ లో ఉన్నాయి కానీ ఇవి క్రౌడ్ పుల్లర్స్ కాదు. టాక్ చాలా బాగుందని వస్తే అప్పుడు జనం థియేటర్లకు కదులుతారు. కాకపోతే పండక్కు ఏదో ఒక సినిమా చూడకపోతే తెగ ఫీలైపోయే తెలుగు ఆడియన్స్ తప్పదనుకుంటే వీటిని చూస్తారు. మరి రాధే శ్యామ్ అయినా మాటకు కట్టుబడి సీజన్ ని వాడుకుంటుందా లేక ఆర్ఆర్ఆర్ దారి పడుతుందా వేచి చూడాలి

Also Read : Sankranthi Releases : సంక్రాంతి సినిమాలు – అభిమానుల మధ్య హాట్ డిస్కషన్స్