iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ VS బాలీవుడ్

  • Published Oct 11, 2022 | 5:25 PM Updated Updated Oct 11, 2022 | 5:25 PM
టాలీవుడ్ VS బాలీవుడ్

తెలుగు సినిమా ప్రమాణాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టే నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఒకప్పుడు పాతిక కోట్ల బడ్జెట్ అంటే అదే గొప్పనుకునే ట్రెండ్ నుంచి అయిదు వందల కోట్లు పెద్ద మ్యాటరే కాదనే స్థాయికి చేరుకుంది. దానికి తగ్గట్టే బిజినెస్, ప్యాన్ ఇండియా మార్కెట్, టికెట్ రేట్లు అన్నీ పెరిగాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కె, ఆది పురుష్, సలార్ కేవలం ఈ మూడింటిని లెక్కేసుకున్నా ఖర్చు ఈజీగా పదిహేను వందల కోట్ల దాకా వెళ్తుంది. ఇది బాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కానీ ఫీట్. అమీర్, సల్మాన్, షారుఖ్ లు ఎంత పెద్ద స్టార్లైనా సరే ఇంత స్థాయిలో అమ్మలేరన్నది వాస్తవం. పైగా ఒక్కొక్కరు ప్రతి సినిమాకు రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడం కామనైపోయింది

స్టాండర్డ్ పెరగడం వల్ల అందరూ మనవైపే చూసే పరిస్థితి. హిందీలో ది కాశ్మీర్ ఫైల్స్, గంగూ బాయ్ కటియావాటి, బ్రహ్మాస్త్ర పార్ట్ 1, భూల్ భులాయ్యా 2 ఎంత గొప్ప విజయం సాధించినా వీటిలో ఏవీ మూడు వందల కోట్లను దాటలేదు. కానీ ఆర్ఆర్ఆర్ పదకొండు కోట్లు రాబడితే కెజిఎఫ్ ఏకంగా పన్నెండు వందల మార్కుతో ఆల్ టైం రికార్డు సృష్టించింది. ట్రిపులార్ ఇప్పటికీ ఓవర్సీస్ ప్రీమియర్లతో అదరగొడుతూనే ఉంది. ఆస్కార్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లకు బాక్సాఫీసు వద్ద దారుణ ఫలితాలు దక్కడం అభిమానులు జీర్ణించుకోలేని వాస్తవం. రీమేకులు కూడా వాళ్ళను కాపాడలేకపోతున్నాయి
Bollywood Big films of 2022 turning out as disaster
అలా అని మనదగ్గర అంతా పాజిటివ్ గా ఉందని కాదు. అంతర్గతంగా సమస్యలున్నాయి. బడ్జెట్ కంట్రోల్ చేయి దాటిపోతోంది. ఏదైనా ఫ్లాప్ వస్తే దాని ప్రభావం నిర్మాత బయ్యర్ల మీద తీవ్రంగా ఉంటోంది. మూడు నాలుగు సినిమాలు ఒకేరోజు క్లాష్ అవ్వడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటున్నాయి. ప్రమోషన్ల మీద పెడుతున్న శ్రద్ధ స్క్రిప్ట్ స్టేజిలో చేయడం లేదనే కామెంట్లు కొందరు మేకర్స్ మీద ఉన్నాయి. ఓటిటి కాలంలో థియేటర్లకు జనం రావాలంటే ఆషామాషీ కంటెంట్ ఉంటే సరిపోదు. దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే చిన్నా పెద్దా తేడా ప్రేక్షకులకు ఉండదు. ఎలా చూసుకున్నా బాలీవుడ్ ను తలదన్నే స్థాయికి టాలీవుడ్ ఎదుగుతున్న మాట ముమ్మాటికీ వాస్తవం