నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యమత్తులో వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇక అతివేగంగా వాహనం వెళ్లే సమయంలో లేదా ఇతర సందర్భాల్లో వాహనాలు బోల్తా పడినప్పడు పేలుడు సంభవిస్తుంది. ఇలాంటి ఘటనల్లో ఎందరో అమాయకులు అగ్నికి ఆహుతి అవుతుంటారు. తాజాగా హైదరాబాద్ లోని వనస్థలిపురంలో అంబులెన్స్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సంయంలో మలక్ పేట్ కు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన అంబులెన్స్.. బీఎన్ రెడ్డి వైపు వస్తుంది. ఇబ్రహింపట్నం నుంచి మలక్ పేట్ వస్తున్న ఈ అంబులెన్స్ హస్తినాపురం వద్ద డివైడర్ ఢీకొని బోల్తా పడింది. ఈక్రమంలో అక్కడే ఉన్న స్థానికులు ప్రమాదానికి గురైన అంబులెన్స్ ను గుర్తించారు. వెంటనే ఆ వాహనం దగ్గరికి చేరుకుని అందులోని డ్రైవర్ ను బయటకు తీశారు. అయితే తీవ్రగాయాలైన ఆ అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మరో అంబులెన్స్ కి సమచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న మరో అంబులెన్స్ లోని వైద్యులు.. గాయలైన డ్రైవర్ ను పరిశీలించి.. చినిపోయినట్లు నిర్ధారించారు.
ఇక అదే సమయంలో అంబులెన్స్ ను తొలగించే ప్రయత్నం చేయగా.. అందులోని ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అంబులెన్స్ కి క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. దీంతో నడి రోడ్డుపై అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. మలక్ పేట్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి పేషెంట్ ను ఇబ్రహీంపట్నంలో దింపేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందనట్లు సమాచారం. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కొందరు చెప్తుండగా, వర్షం కారణంగా వెహికల్ స్కిడై ఈ ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా ఎందరి ప్రాణాలో కాపాడే ఓ అంబులెన్స్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచి వేస్తోంది. సమాచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మరి.. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: స్కూల్ టైమింగ్స్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుంచి..