Arjun Suravaram
Arjun Suravaram
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రమైన గాయాలతో, అంగవైకల్యం ఏర్పడి.. జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం.. బొలెరో, బుల్లెట్ బైక్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ క్రమంలో బొలెరో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది. దీంతో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. బావి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్ర బాగా పెరిగింది. బైక్ నడిపే వ్యక్తి నిర్లక్ష్యం రావడంతోనే ఈప్రమాదం జరిగినట్లు స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హాజరీబాగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అలానే ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హజారీబాగ్ జిల్లా పద్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమి గ్రామ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెస్క్యూ టీమ్.. బావిలో దిగి మృతదేహాలను బయటకు తీసిందని చెప్పారు. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.