iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు షాకిచ్చిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే!

  • Author Dharani Published - 11:40 AM, Wed - 5 July 23
  • Author Dharani Published - 11:40 AM, Wed - 5 July 23
పసిడి ప్రియులకు షాకిచ్చిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే!

విదేశాల్లో బంగారం అంటే కేవలం పెట్టుబడి పెట్టే సాధనం. కానీ మన దేశంలో మాత్రం పసిడి అంటే ఆభరణాలు. ప్రతి మహిళ ఒంటి మీద ఏంతో కొంత బంగారం ఉంటుంది. ఎంత ఎక్కువ బంగారం ఉంటే.. అంత ధనవంతుల కింద లెక్కిస్తారు. ఇక మన దేశంలో పండగలు, పబ్బాలు, వివాహాది శుభకార్యాల వేళ బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి. అయితే పెరుగుతున్న బంగారం ధరలు చూసి.. సామాన్యులు కళ్లు తేలేస్తున్నారు. బంగారం కొనాలంటేనే అమ్మో అనే పరిస్థితులు. వివాహం సమయంలో కూడా చాలా కొద్ది మేర మాత్రమే బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఇక తులం పసిడి ధర అర లక్ష రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. 22 క్యారెట్‌ బంగారం ధర 50 వేల రూపాయలకు పైగా ఉండగా.. 24 క్యారెట్‌ బంగారం ధర 55 వేల రూపాయలకు పైగానే ఉంది. ఇక గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర.. నేడు స్వల్పంగా పెరిగింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎంత పెరిగింది అంటే..

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగిన నేపథ్యంలో.. దేశీయంగా కూడా బంగారం ధర పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.100 మేర పెరిగి.. ప్రస్తుతం రూ.54,150 వద్ద కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర కూడా 10 గ్రాముల మీద రూ.100 ఎగబాకి ప్రస్తుతం రూ.59,060 వద్ద ఉంది. ఇక దేశ రాజదాని ఢిల్లీ మార్కెట్లో పసిడి రేటు పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం రేటు 10 గ్రాములకు రూ. 100 పెరిగి రూ. 54,300 వద్ద ట్రేడవుతుండగా.. 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పుత్తడి ధర కూడా రూ.100 ఎగబాకి రూ.59,220 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నేడు బంగారం ధరలు పెరిగిన క్రమంలో హైదరాబాద్‌ మార్కెట్‌లో సైతం వెండి రేట్లు ఎగబాకాయి. క్రితం రోజు అనగా మంగళవారం వెండి ధర కిలో మీద రూ.200 తగ్గగా.. నేడు కేజీ వెండి ధర రూ. 300 పెరిగి ప్రస్తుతం రూ.75,800 వద్ద ఉంది.హైదరాబాద్‌లో వెండి ధర పెరగ్గా.. ఢిల్లీలో మాత్రం రేటు తగ్గింది. నేడు హస్తినలో కిలో వెండి రూ.200 తగ్గి ప్రస్తుతం రూ. 71,700 వద్ద కొనసాగుతోంది. ఇక గ్లోబల్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1927 డాలర్లుగా ఉంది. స్పాట్‌ సిల్వర్‌ ధర 23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి