iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. దిగి వస్తోన్న ధర!

  • Published Jun 29, 2023 | 1:49 PMUpdated Jun 29, 2023 | 1:49 PM
  • Published Jun 29, 2023 | 1:49 PMUpdated Jun 29, 2023 | 1:49 PM
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. దిగి వస్తోన్న ధర!

బంగారం అంటే భారతీయులకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆభరణంగా మాత్రమే కాక అక్కరకు అదుకునే ఆప్తుడిగా భావిస్తారు. అందుకే సందర్భం వచ్చిన ప్రతి సారి బంగారం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. పది గ్రామలు పసిడి ధర 60 వేల రూపాయలు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో బంగారం కొనాలనుకునేవారు.. కాస్త వెనకాముందు ఆలోచిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర దిగి వస్తోంది. పైగా ఇప్పుడు ఆషాఢ మాసం కావడంతో.. వివాహాలు వంటి శుభకార్యాలు కూడా లేక.. పసిడికి గిరాకి తగ్గింది. దాంతో బంగారం ధర భారీగా పడిపోతుంది. దేశీయంగానే కాక.. గ్లోబల్ బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు పడిపోతుండడం పసిడి ప్రియులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. బంగారం కొనాలని ఆలోచించే వారు.. ఇప్పుడు పసిడి కొనుగోలు చేస్తే మంచిది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

నేడు హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాల్లో బంగారం ధర ఇలా ఉంది. భాగ్యనగరం బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ మరింత పడిపోయింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల మీద రూ. 300 తగ్గి ప్రస్తుతం రూ. 54,050 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాముల ధర ఇవాళ రూ. 220 తగ్గి రూ. 58, 960 వద్ద కొనసాగుతోంది. ఇక అటు దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల మీద రూ. 320 తగ్గి రూ. 59,110 గా ఉంది. అలానే ఆభరణాల తయారీకి వినిగించే 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర. 300 తగ్గి తులానికి రూ. 54,200 వద్ద కొనసాగుతోంది.

స్థిరంగా వెండి ధర..

నేడు బంగారం ధర దిగి వస్తే.. వెండి ధర మాత్రం.. కొన్ని చోట్ల స్థిరంగా ఉండగా.. మరి కొన్ని చోట్ల పెరిగింది. ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉంది. క్రితం రెండు సెషన్లలో వెండి ధర కిలో మీద ఏకంగా రూ. 1200 పెరిగిన విషయం తెలిసిందే. కానీ ఇవాళ మాత్రం వెండి ధరలో ఏ మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 75,700 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు ఇవాళ రూ. 400 పెరిగింది. ప్రస్తుతం హస్తినలో కిలో వెండి ధర రూ. 71,900 వద్ద ట్రడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ దిగి వస్తోన్న పసిడి ధర…

దేశీయంగానే కాక అంతర్జాతీయ మార్కెట్లో కైడా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. క్రితం సెషన్‌‌తో పోలిస్తే ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు భారీగా పడిపోయింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1911 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వెండి ధర ఒక ఔన్సుకు 22.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి