iDreamPost
android-app
ios-app

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే!

  • Published Oct 19, 2023 | 8:24 AM Updated Updated Oct 19, 2023 | 8:24 AM
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే!

ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో అయోమయ పరిస్థితిలో ఉన్నారు కొనుగోలుదారులు. గత నెల ప్రతిరోజు క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ఈ మధ్య మళ్లీ పుంజుకుంది. ఇజ్రాయెల్-పాలస్తీనాల మద్య జరుగుతున్న యుద్దం కారణంగా పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. నిన్న రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం నేడు మళ్లీ పెరిగింది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సమయంలో బంగారం ధరలు పెరిగి షాక్ ఇస్తున్నాయి. మార్కెట్ లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం అంటే ఎంతో ఇష్టపడే మహిళలు పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టడంతో జ్యువెలరీ షాపులకు క్యూ కట్టారు. నిన్నటితో పోల్చుకుంటే గురువారం మార్కెట్ లో తులం బంగారం స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,460 వద్దకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,500 కి చేరింది. కాకపోతే వెండి ధరలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేవు. కిలో వెండి ధర రూ.78 వేల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,500 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ ధర రూ. 60,650 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా లాంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,460 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.60,500 కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,720 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ.78 వేల వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000లు ఉండగా, బెంగుళూరులో రూ.74,000 వద్ద ట్రెండ్ అవుతుంది.