iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. వేలల్లో తగ్గిన బంగారం ధర!

  • Author Dharani Updated - 11:35 AM, Mon - 3 July 23
  • Author Dharani Updated - 11:35 AM, Mon - 3 July 23
పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. వేలల్లో తగ్గిన బంగారం ధర!

బంగారం కొనాలని భావించి.. పెరుగుతున్న ధర చూసి భయపడుతున్నారా.. అయితే మీకు పండగలాంటి శుభవార్త. పసిడి ధర భారీగా దిగి వచ్చింది. వెంటనే తర్వపడండి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. భవిష్యత్తులో ధర పెరిగితే ఇబ్బంది కనుక.. ఇప్పుడే త్వరపడండి అంటున్నారు. అటు అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు పడిపోతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌.. వడ్డీ రేట్లు భారీగా పెరగడమే కాక.. ఈ ఏడాది మరో రెండు సార్లు వడ్డీ రేట్లు పెరుగాయనే సంకేతాలు ఇవ్వడంతో.. బంగారం ధర పడిపోతుంది. మన దేశంలో కూడా పసిడి రేటు పడిపోతుంది. పైగా ఇది ఆషాఢ మాసం కావడంతో.. శుభకార్యాలు ఏవి లేవు. దాంతో పసిడి కొనుగోళ్లకు డిమాండ్‌ పడిపోయింది. ఇక నెల రోజుల్లోనే బంగారం ధర ఏకంగా రెండు వేల రూపాయలు తగ్గింది. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది.. పెరిగిందా.. తగ్గిందా అంటే

నేడు హైదరాబాద్‌, ఢిల్లీ నగరాల్లో బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు అనగా జూలై 3న పసిడి ధర తగ్గలేదు.. పెరగలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 54,150 వద్ద ఉండగా.. 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర రూ.59,070 వద్ద ఉంది. ఇక జూన్ 2న అంటే నెల రోజుల క్రితం 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర రూ.56 వేల వద్ద ఉంది. ఈ నెల రోజుల్లో రెండు వేల రూపాయలు తగ్గింది. ఇక నేడు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ.59,220 వద్ద ట్రేడవుతోంది.

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. జూన్‌ 2 నుంచి నేటి వరకు వెండి ధర మూడు వేల రూపాయల మేర దిగి వచ్చింది. ఇక నేడు దేశ రాజదాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.71,900 వద్ద కొనసాగుతోంది. సరిగ్గా నెల కిందట అనగా జూన్ 2న కిలో వెండి ధర రూ.74,500 వద్ద ఉండేది. ఇక హైదరాబాద్‌లో నేడు కేజీ వెండి రేటు రూ.75,700 వద్ద ఉంది. జూన్ 10న ఇది గరిష్టంగా రూ.79,800 వద్ద ఉండేది. అంటే 20 రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో వెండి ధర సుమారు రూ.4 వేలకుపైగా దిగొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి