షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. భయంతో జనాల పరుగులు!

షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. భయంతో జనాల పరుగులు!

ఈ మధ్యకాలంలో తరచూ  ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయలతో  జీవితాన్ని నరకంగా  అనుభవిస్తున్నారు. గతంలో సికింద్రా బాద్ పరిధిలో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో దాదాపు 10 మందికి పైగా అమాయకులు  ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అభి షాపింగ్ మాల్ లో శనివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం జరిగింది. మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. భారీ ఎత్తున ఎగసి పడ్డాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎగసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటకు పైగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కారణంగా షాపింగ్ మాల్ లోని దుస్తులు, డ్రెస్స్ లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాదం కారణంగా దాదాపు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా షాపింగ్ పరిసర ప్రాంతాలు పొగతో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.  పక్కనే ఉన్న దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. చుట్టు పక్కల ఉండే నివాసులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. వేసవి కాలం ఇంకా కొనసాగుతున్నందున.. అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments