ఈ మధ్యకాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలానే ఎండల తీవ్రత వాహనాలు దగ్ధమవుతున్నాయి. ఇలా వాహనాలు కాలిపోయిన ప్రమాదంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నడి రోడ్డుపై బస్సు దగ్ధమైంది. ఆ బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బుధవారం రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి 27 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట సమీపంలో 16వ నంబర్ జాతీయ జాతీయ రహదారిపై సాంకేతిక సమస్య తలేత్తింది. దీంతో కాసేపటికే బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్థరాత్రి సమయం కావడంతో ప్రయాణికులంత గాఢ నిద్రలో ఉన్నారు. మంటలు వచ్చిన విషయన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి.. ప్రయాణికులను నిద్ర నుంచి లేపాడు. భయంతో ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి రోడ్డుపైకి వచ్చారు. అందరూ చూస్తుండగానే బస్సు మంటల్లో కాలిపోయింది.
ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది. అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక సీఐ రంగనాథ్, ఎస్సై వెంకటేశ్వర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసి.. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ఇతర వాహనాల ద్వారా వారి గమ్య స్థానలకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..ఇలాంటి ఘటనల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.