iDreamPost
android-app
ios-app

అమానుషం.. దళితుడితో MLA బూట్లు నాకించిన DSP!

అమానుషం.. దళితుడితో MLA బూట్లు నాకించిన DSP!

రాజస్థాన్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ దళితుడితో ఎమ్మెల్యే చెప్పులను బలవంతంగా నాకించారు. ప్రజలను రక్షించాల్సిన ఓ ఉన్నత స్థాయి పోలీస్ అధికారే స్వయంగా ఈ దారుణాన్ని చేయించాడు. బాధితుడిపై మూత్ర విసర్జన చేయడమే కాకుండా.. ఎమ్మెల్యే చెప్పులను అతడి చేత డీఎస్పీ నాకించారు. ఈ ఘటన  రాజస్థాన్ లో జూన్ 30న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలో పలు ప్రాంతాల్లో జరిగాయి. ఎన్ని శిక్షలు విధించిన కొందరిలో మార్పు రావడం లేదు. అందుకు ఉదాహరణే రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన. బాధితుడు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్ రాష్ట్రం జైపుర్ జిల్లాలోని తొండలరి అంధి గ్రామంలో రాజు ప్రసాద్ నాయక్(51) అనే దళితుడు.. తన భార్యతో కలిసి పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక రోజు రాజు ప్రసాద్, అతడి భార్యతో కలిసి పొలంకి వెళ్లాడు అదే సమయంలో అతడి పొలం వద్దకు కొందరు పోలీసులు వచ్చి.. ఏ కారణం లేకుండానే దాడి చేశారు. అనంతరం ఆ బాధితుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీణా ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే తో పాటు డీఎస్పీ శివకుమార్ భరద్వాజ్ కూడా ఉన్నారు.

డీఎస్పీ శివకుమార్ అతడిపై మూత్ర విసర్జన చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. అంతేకాక ఎమ్మెల్యే షూలను కూడా నాకించి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే అనుమతి లేకుండా  ఆ పొలంలోకి ఎలా దిగుతావని పోలీసులు బెదిరించాటరంట. తన వద్ద ఉన్న ఫోను కూడా లాగేసుకుని, ఈ విషయం ఎవరికైన చెబితే .. అంతు చూస్తామంటూ  బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. జూన్ 30న ఈ ఘటన జరగ్గా.. భయంతో బాధితుడు బయటకు రాలేదు. చివరకు జూలై 27న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు.

అయితే అతడి ఫిర్యాదును తొలుత పోలీసులు నిరాకరించారంట.  కోర్టు ఆదేశాల తరువాతే పోలీసులు కేసు నమోదు చేసినట్లు బాధితుడు వాపోయాడు. దళితుల రక్షణకు ఎన్ని చట్టాలు చేసిన.. కొందరు రాక్షసులు ఇలాంటి అమానుష ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. సదరు ఎమ్మెల్యే, డీఎస్పీలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి.. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు ఎలాంటి శిక్ష విధించాలి? . మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆలస్యంగా వచ్చాడని.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టారు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibomjojobet giriş