iDreamPost
android-app
ios-app

శ్రీరామ చంద్రుడి లాంటి భర్త దొరికాడు అనుకుంది! కానీ.., వచ్చింది కీచకుడు!

  • Published Jun 21, 2024 | 5:27 PMUpdated Jun 21, 2024 | 5:27 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నం కోసం పెట్టిన వేధింపులు భరించలేక ఓ యువతి చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది. పుట్టింట్లో తన గోడు చెప్పుకున్న తీరకపోవడంతో గర్భవతిగా ఉండగానే తనువు చలించింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నం కోసం పెట్టిన వేధింపులు భరించలేక ఓ యువతి చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది. పుట్టింట్లో తన గోడు చెప్పుకున్న తీరకపోవడంతో గర్భవతిగా ఉండగానే తనువు చలించింది.

  • Published Jun 21, 2024 | 5:27 PMUpdated Jun 21, 2024 | 5:27 PM
శ్రీరామ చంద్రుడి లాంటి భర్త దొరికాడు అనుకుంది! కానీ.., వచ్చింది కీచకుడు!

ఈ మధ్య పెద్దలు కుదిర్చిన వివాహాలైనా, ప్రేమ వివాహాలైనా ప్రశ్నర్థకారంగా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే.. ఏ రకంగా చేసుకున్న వివాహాలు కూడా సక్రమంగా, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు కలిసివుండటం లేదు. ముఖ్యంగా కొంతమంది ఈ వైవాహిక జీవితంలో లేని పోని కలతాలతో విడిపోతుంటే.. మరి కొందరు తప్పుడు బంధాలకు ఆకర్షితులవుతూ.. హత్యలు చేస్తున్నారు. ఇక మరొపక్క వరకట్న వేధింపులకు గురి చేస్తూ చిత్ర హింసలకు పెడుతున్నారు. కాగా, ఇప్పటికే దేశంలో  చాలామంది కట్నం కోసం అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. అగ్ని సాక్షిగా తాళికట్టి, ఏడడుగులు నడిచిన భార్యను కాళ్ల పారణి అరకముందే వేధింపులకు గురి చేస్తున్నారు. నిండు నూరెళ్లు తోడు నీడగా.. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే.. అదనపు కట్నం కోసం కడతేరుస్తున్నారు.తాజాగా ఈ కట్నం వేధింపులు తాళలేక మరో మహిళ తనువు చలించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి కట్నం కోసం భర్త పెట్టిన వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య చేసుకున్న యువతి మూడు నెలల గర్భవతి కావడం గమన్హారం. అయితే బాధిత యువతి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు..  మణికందన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కన్యాకుమారి జిల్లా తిరువత్తురు రోడ్ కలంపాడు సెంబరుతివిలై ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే అతని రెండవ కుమార్తె అర్చన (23) బీఏ చదివింది. అయితే ఆమె కట్టకూర చంద్రన్‌విలైకి చెందిన అబిష్మోన్ (27)  యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి 2022 సంవత్సరం అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. ఇక వివాహానంతరం కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం ఆనందంగా, సాపీగా సాగింది.

కానీ, రోజులు గడిచేకొద్దీ అబిష్మోన్ కట్నం డిమాండ్ చేసేవాడు. అంతేకాకుండా.. ఆ కట్నం కోసం అర్చనను కొట్టి చిత్ర హింసలు పెట్టేవాడు. ఇకపోతే భర్త పెట్టే హింసలకు అతని తల్లి, సోదరి కూడా సహకరించేవారు. ఇలా రోజు వారు పెట్టే వేధింపులు భరించలేని యువతి గత ఆదివారం తన పుట్టింటికి వచ్చి బోరున విలపించింది. ఈ క్రమంలోనే భర్త నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశాను. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాను అని రోజూ మద్యం, గంజాయి తాగి  ఇంటికి వచ్చి కొట్టేవాడని విలపించింది. ఇక భర్తతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కట్నం కోసం వేధిస్తున్నారని కంటతడి పెట్టుకోంది.

అయితే కూతురిని ఓదార్చి సర్ది చెప్పిన తల్లిదండ్రులు ఆమెను తిరిగి మళ్లీ అత్తవారింటికి పంపించారు. ఈ క్రమంలోనే అత్తవారింటికి వెళ్లిన అర్చన  జూన్ 18న ఇంట్లో ఉరివేసుకుందని, ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించమని భర్త  బంధువులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే తల్లిదండ్రులు వెళ్లగా అక్కడ అర్చన మృతి చెందిందని తెలియడంతో వారు బోరున విలపించారు. ఇక కూతురి మృతితో అర్చన తండ్రి తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అలాగే అర్చన మృతి అనుమానాస్పదంగా ఉందని  వారు పోలీసులకు తెలియజేశారు. ఇక ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేేసుకోని దర్యప్తు కొనసాగిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి