iDreamPost

ప్రియురాలు అన్యాయం చేసిందని.. ప్రియుడు ఆగ్రహం! సైకోలా పట్టపగలే!

  • Published Jun 18, 2024 | 5:29 PMUpdated Jun 18, 2024 | 5:29 PM

తాజాగా ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని  అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేశాడు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ హత్య వెనుకు ఉన్న కారణం అని సమాచారం. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

తాజాగా ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని  అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేశాడు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ హత్య వెనుకు ఉన్న కారణం అని సమాచారం. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

  • Published Jun 18, 2024 | 5:29 PMUpdated Jun 18, 2024 | 5:29 PM
ప్రియురాలు అన్యాయం చేసిందని.. ప్రియుడు ఆగ్రహం! సైకోలా పట్టపగలే!

ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాల కారణంగా జరుగుతున్న దారుణాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమించిన పాపానికి ప్రేమికుల చేతులో మోసపోవడం, హత్యకు గురవ్వడం వంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా క్షణికావేశంలో ప్రేమికులు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వలన వారి కుటుంబాలకు శోక సంధ్రంలో మునిగిపోతున్నాయి.అసలు తెలిసి తెలియని వయసు ప్రేమలు, పెళ్లి, ఎఫైర్స్ అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తిరిగినంత కాలం ఎంజాయ్ చేస్తూ తిరిగి.. ఆ తర్వాత విడిపోవడం, వేరొకరితో రిలేషన్ కొనసాగించడమే ఈ ఘటనలు చోటు చేసుకోవడానికి ముఖ్యం కారణం అని చెప్పవచ్చు. తాజాగా ఈ క్రమంలోనే ఓ యువకుడు,  రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని  అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేశాడు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ హత్య వెనుకు ఉన్న కారణం అని సమాచారం. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

తాజాగా ముంబైలోని వసాయ్ లో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని ఇనుప రెంచ్ తో తలపై 14 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు.  కాగా, ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించిన లైవ్ సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చించ్‌పాడ ప్రాంతంలో జరిగింది. ఇకపోతే.. ఆ వ్యక్తి దాడి చేస్తున్న సమయంలో చాలామంది స్థానికులు ఘటన స్థలంలో ఉన్నప్పటికీ, ఎవరూ అతడిని ఆపడానకిి ముందుకు రాలేదు. అందరూ అలా చూస్తునే ఉండిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యలు ఓ వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీశాడు.

ఇక హత్యకు సంబంధించిన వివరాళ్లోకి వెళ్తే.. హత్యకు గురైన బాధిత యువతి ఆర్తి యాదవ్ (20)గా పోలీసులు గుర్తించారు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇక నిందితుడు రోహిత్ యాదవ్ గా గుర్తించారు. అయితే రోహిత్ యాదవ్, ఆర్తి యాదవ్ కొన్ని రోజుల క్రితం ప్రేమించుకుని విడిపోయారు. ఈ క్రమంలోనే బాధిత యువతి వేరే రే అబ్బాయితో చనువుగా ఉంటుందని నిందితుడికి తెలియడంతో.. కోపం పెంచుకొని ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిందుతుడు తెలిపాడు. కాగా, . ఈ ఘటనపై వలీవ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై  పోలీసులు మరింత లోతుగా  దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి