iDreamPost
android-app
ios-app

రూ.15 లక్షలకు గణేశ్ లడ్డూ దక్కించుకున్న టెకీ.. కానీ, కాసేపటికే..

  • Published Sep 16, 2024 | 3:07 PM Updated Updated Sep 16, 2024 | 3:07 PM

గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న ఓ వ్యక్తి లడ్డును సొంతం చేసుకున్న ఆనందం కాసేపటికే కనుమరుగైంది. ఎవ్వరు ఊహించని విధంగా విధి ఆయనపై చిన్న చూపు చూసింది. కనీసం ఆ దేవుడికి కూడా కనికరం, లేదోమో తెలియదు కానీ ఆయన ఆనందాలను అర్ధంతరంగా చెరిపేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న ఓ వ్యక్తి లడ్డును సొంతం చేసుకున్న ఆనందం కాసేపటికే కనుమరుగైంది. ఎవ్వరు ఊహించని విధంగా విధి ఆయనపై చిన్న చూపు చూసింది. కనీసం ఆ దేవుడికి కూడా కనికరం, లేదోమో తెలియదు కానీ ఆయన ఆనందాలను అర్ధంతరంగా చెరిపేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 16, 2024 | 3:07 PMUpdated Sep 16, 2024 | 3:07 PM
రూ.15 లక్షలకు గణేశ్ లడ్డూ దక్కించుకున్న టెకీ.. కానీ, కాసేపటికే..

ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నగరంలో ఏ ప్రాంతాల్లో , ఏ వీధిలో చూసిన గణేశ్ నిమజ్జన శోభయాత్రకు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ పాల్గొంటు డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ గణేశ్ నవరాత్రి ఉత్సవాల ముంగింపుకు ముందు.. లడ్డు వేలం పాట కార్యక్రమం అనేది కచ్చితంగా నిర్వహిస్తారు. ఇక వేడుకల్లో సామాన్యుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, ధనికులు పాల్గొని ఆ విఘ్నేశ్వరుని లడ్డు సొంతం చేసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వేడకుల్లో పాల్గొని లడ్డును సొంతం చేసుకున్న ఓ వ్యక్తికి ఆ ఆనందం కాసేపటికే కనమరుగైంది. ఎవ్వరు ఊహించని విధంగా విధి ఆయనపై చిన్న చూపు చూసింది. కనీసం ఆ దేవుడికి కూడా కనికరం, లేదోమో తెలియదు కానీ ఆయన ఆనందాలను అర్ధంతరంగా చెరిపేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గణేష్ నవరాత్రి ఉత్సవాల వేళ హైదరాబాద్ మణికొండ అల్కాపురి కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  గణేశుడి లడ్డు వేలం పాటలో లడ్డూను సొంతం చేసుకున్న కాసేపటికే ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. మణికొండ అల్కపురి కాలనీలో నివాసముండే శ్యామ్ ప్రసాద్ ఓ ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే శ్యామ్ ప్రసాద్ అతడు నివస్తిస్తున్న కాలనీలో వినాయకుడిని ప్రతిష్ఠించి  కాలనీలో పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. సెప్టెంబర్ 15న తొమ్మిదో రోజు నిమజ్జనం ఏర్పాట్లు చేశారు.  ఇక ఈ నిమజ్జన వేడుకల్లో లడ్డూను వేలం వేయగా.. ఆ లడ్డూను శ్యామ్ ప్రసాద్ ఏకంగా రూ. 15 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు.

 అయితే లడ్డూను దక్కించుకున్న అనే ఆనందంలో శ్యామ్ ప్రసాద్ మండపం వద్దే కాలనీ వాసులతో హుషారుగా కాసేపు డ్యాన్స్ చేశాడు. ఇక అలా ఆడిపాడి ఎంజాయ్ చేసిన శ్యామ్..  ఆ లడ్డూను తీసుకొని ఇంటికి వెళ్లి కుటుంబంతో ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే బాగా అలసిపోయిన శ్యామ్ సోఫాలో కాసేపు కూర్చున్నాడు. కానీ ఇంతలోనే ఛాతీలో నొప్పి వస్తుందని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇక అక్కడ శ్యామ్ ను వైద్యులు పరీక్షించి చూడగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు చెప్పారు. దీంతో అప్పటి వరకు సరదాగా ఆడిపాడిన శ్యామ్.. ఇలా ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం ఏమిటి అని ఆ కుటుంబం షాక్ కు గురైంది. అయితే శ్యామ్ గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో లడ్డూ సొంతం చేసుకొని ఆనందంతో ఇంటికి వచ్చిన శ్యామ్.. కొన్ని క్షణాల్లోనే మరణించడం పై ఆ కుటుంబం తీవ్ర శోకసంధ్రంలోకి మునిగిపోయింది. అలాగే అప్పటి వరకు తమతో సరాదాగా ఆడిపాడినా వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం పై స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.