iDreamPost
android-app
ios-app

కరుణానిధి కోరిక నెరవేర్చిన స్టాలిన్…. ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయం..

కరుణానిధి కోరిక నెరవేర్చిన స్టాలిన్…. ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయం..

తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులే అయినా ప్రజా సంక్షేమ పథకాలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయినా ఇంకా సమాజంలో చాలా వర్గాల ప్రజలు ఇంకా అణిచివేతకు గురవుతూనే ఉన్నారు. దేశంలో ఎక్కడో ఒకచోట అణగారిన వర్గాలు అణిచివేతకు గురవుతున్నాయి. సైన్సు అభివృద్ధి చెందిన, విద్యలో రాణిస్తున్న ఇంకా సమాన హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. 75 ఏళ్ళు అయిన ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయి అంటేనే ఇంకా మన వ్యవస్థలో మార్పు రాలేదని అర్థం. ప్రభుత్వాలు మారిన ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు కానీ ఇప్పటికి కొన్ని వర్గాల జీవితాల్లో మార్పులు రాలేదు.

స్టాలిన్ సంచలన నిర్ణయం…

స్టాలిన్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. అనాదిగా వేదం నేర్చుకున్న బ్రాహ్మణ కులం వారే పూజారులు, అర్చకులుగా దేవాలయాల్లో కొనసాగుతుండగా ఇప్పుడు సమాజంలో అన్ని కులాల వారికి అర్చకులుగా అవకాశం కల్పించడం పెద్ద చర్చకు దారితీసింది.

జయం మనదేరా సినిమాలో లాగా దళితుడు వేదం నేర్చుకుని పూజరిగా మారడం జీర్ణించుకొని అగ్రవర్ణ కుల జాడ్యం ఇంకా మనదేశంలో ఉంది. దేవుడికి దళిత వర్ణాలు ఇంకా దూరంగానే ఉన్నాయి.అసెంబ్లీ ఎన్నికల సమయంలో మ్యానిపెస్టోలో చెప్పిన విధంగా స్టాలిన్ ప్రభుత్వం తాజగా ఆలయాల్లో పూజారులుగా అన్ని కులాల వారికి అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా మారింది. తమిళనాడులోని దేవాలయాల్లో అన్ని కులాల వారికి అర్చకులుగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24 మందిని అర్చకులుగా నియమిస్తూ స్టాలిన్ నియామక ఉత్తర్వులు అందజేశారు. అర్చకులుగా నియమింపబడ్డ వారు పూర్తిస్థాయి శిక్షణ తరువాతే విధుల్లో చేరాలని ఆదేశించారు.దింతో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కోరిక నెరవేరిందని ట్విట్టర్లో తెలిపారు.
స్టాలిన్ నిర్ణయాన్ని బీజేపీతో సహా స్వామిజీలు, బాబాలు, మఠాధిపతులు స్వాగతిస్తున్నారు.

పెట్రో రేట్ల తగ్గింపు..

దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు పెరిగిపోతుంటే కరోనాతో కుదేలాయినా రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్, డీజిల్ మీద వచ్చే పన్ను ఆదాయమే దిక్కు. అందుకే రేట్లు పెరిగిన ప్రభుత్వాలు కుక్కిన పెనులా వ్యాట్ రూపంలో ఖజానలో వేసుకుంటున్నాయి. కానీ తమిళనాడులో పెట్రోల్ మీద 3రూపాయలు తగ్గించి స్టాలిన్ తీసుకున్న నిర్ణయం ఇతర ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారింది. సరిహద్దుల్లో ఉన్న ప్రజలు తమిళనాడుకు వెళ్లి పెట్రోల్ తీర్చుకుంటున్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మాతృత్వ సెలవులను 9 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్‌ వంటి పథకాలతో స్టాలిన్ ప్రభుత్వం దూసుకుపోతుంది. ప్రస్తుతం స్టాలిన్ తీసుకున్న అర్చకుల నియమకంతో వ్యవస్థ పూర్తిగా మరకపోయినా మార్పుకు శ్రీకారం మాత్రం పడుతుంది. స్టాలిన్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా రెస్పాన్స్ ఎలా వస్తుందో మిగితా ప్రభుత్వాలు కూడా అమలు చేస్తాయా వేచి చూడాలి.