రాజ్యసభకు పీకే . ..!!

పీకే త్వరలోచట్టసభలకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నుంచి హామీ కూడా వచ్చింది ..ఏంటీ పీకే పవన్ కళ్యాణ్ చట్టసభలోకి వెళ్తున్నారా .??ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ..ఏ ముఖ్యమంత్రి?? జగనా ??కేసీఆరా ..ఎవరు..అదేనా మీ డవుట్ ..ఆగండి ..ఆగండి .

మీరనుకుంటున్న పవన్ కళ్యాణ్ కాదు ..పీకే అంటే ప్రశాంత్ కిశోర్… రాజకీయా వ్యుకర్త,
పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీల
విజయం వెనుక కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజ్యసభకు వెళ్లనున్నారు. గతంలో గుజరాత్ లో బిజెపి , ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం వెనుక ఆయన కృషి , వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. ఈయన
సాయంతో ఎంతోమంది ఎంపీలు ఎమ్మీల్యేలు అయ్యారు కాశనే ఈయన మాత్రం రాజకీయ పదవికి దూరంగానే ఉంటూ వచ్చారు.ఆ మధ్య జనతాదళ్ (యునైటెడ్)పార్టీలో చేరినా దాని సారధి నితీష్ కుమార్ తో పొసగక అక్కడినుంచి బహిష్కృతుడయ్యారు.

తాజాగా బెంగాల్లో మమతా బెనర్జీ సర్కారుకు వ్యూహకర్తగా ఉంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్  గెలుపు మార్గం పట్టించే పనిలో ఉన్నారు. అయితే ఈ నెలాఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ను రాజ్యసభకు పంపాలని మమతా బెనర్జీ నిర్ణయించినట్లు తెలిసింది.

ఈసారి తృణమూల్ నుంచి మనీష్ గుప్తా, జోగేన్ చౌదరి, అహ్మద్ హసన్, కెడి సింగ్ ఈ నలుగురు పదవీ విరమణ చేయనుండగా వారి స్థానంలో కొత్త వారిని రాజ్యసభకు పంపాలని మమత తలపోస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ కు ఆమె హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖచ్చితంగా మమతకు వస్తాయి. ఇంకా కాంగ్రెస్, లెఫ్ట్ మద్దతు గాని కూడగడితే ఇంకో సీటు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైతేనేం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి నేరుగా రాజకీయ నాయకుడిగా మారనున్నారు అన్నమాట…

Show comments