iDreamPost
iDreamPost
17 ఏళ్ళ క్రితం 2003లో టాలీవుడ్ కు పరిచయమైన చంద్రశేఖర్ యేలేటి ఇప్పటిదాకా తీసింది కేవలం 6 సినిమాలే. కథా కథనాల్లో ఒక విలక్షమైన శైలిని ఏర్పరుచుకుని కౌంట్ కంటే ఎక్కువగా కంటెంట్ మీదే ఫోక్స్ పెట్టే ఈయనకు ప్రత్యేకమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఐతే మూవీలో ఎలాంటి స్టార్లు లేకుండా కేవలం నలుగురు కుర్రాళ్ళను పెట్టి స్క్రీన్ ప్లే తో ఏలేటి చేసిన మేజిక్ కు అందరూ ఆశ్చర్యపోయారు. ఛార్మీ ప్రధాన పాత్రలో రూపొందిన అనుకోకుండా ఒక రోజు సైతం విమర్శకులను మెప్పించింది. గోపిచంద్ తో చేసిన డిఫరెంట్ థ్రిల్లర్ ఒక్కడున్నాడు కొంత బాలన్స్ తప్పి అంచనాలు అందుకోలేదు కానీ ఇప్పుడు చూస్తే చాలా డీసెంట్ ఫీలింగ్ కలుగుతుంది.
మంచు మనోజ్ ప్రయాణం పేరు తీసుకొస్తే గోపీచంద్ తో రెండోసారి చేసిన సాహసం డిఫరెంట్ గా అనిపించినా కమర్షియల్ గా పెద్దగా సేఫ్ అవ్వలేదు. ఆ తర్వాత మోహన్ లాల్ ని ఒప్పించి మరీ మనమంతా చేశారు. ఇదీ మెప్పులు పొందిందే తప్ప భారీగా డబ్బులు తీసుకురాలేదు. అయినా ఏలేటి మీద ఉన్న ఓ ప్రత్యేకమైన గౌరవం ప్రేక్షకులకు అలా ఉండిపోయింది. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న చెక్ మీద కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. జైలు బ్యాక్ డ్రాప్ లో ఏదో డిఫరెంట్ పాయింట్ తో ఇది రూపొందిస్తున్నట్టు టాక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రకుల్ లాయర్ పాత్రలో కనిపిస్తోంది.
భీష్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నితిన్ ప్రయోగాలకు వెనుకాడటం లేదు. రంగ్ దే తన మార్కు లవ్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ అందాదున్ రీమేక్ మాత్రం రిస్కే. కళ్లులేని వాడిగా మొదటిసారి కనిపించబోతున్నాడు. నభా నటేష్ హీరోయిన్ కాగా తమన్నా నెగటివ్ షేడ్స్ లో చేయనుంది. ఇప్పుడీ చెక్ కూడా జైలు నేపథ్యంలో డిఫరెంట్ గా రూపొందుతోంది. ప్రిజన్ బ్రేక్ సిరీస్ తరహాలో ఊహించని రీతిలో చంద్రశేఖర్ స్క్రీన్ ప్లేతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని ఇన్ సైడ్ టాక్. అది నచ్చే నితిన్ అన్ని తక్కువ సినిమాలు చేసిన ఆయనకు ఓకే చెప్పినట్టుగా వినికిడి. మొత్తానికి శ్రీనివాస కళ్యాణం ఇచ్చిన షాక్ కి ఏడాదికి పైగానే గ్యాప్ తీసుకున్న నితిన్ స్ట్రాటజీ బాగానే కనిపిస్తోంది