iDreamPost
android-app
ios-app

మూడు లాంతర్ల స్తంభం పున:ప్రతిష్ట: టిడిపికి చెక్

మూడు లాంతర్ల స్తంభం పున:ప్రతిష్ట: టిడిపికి చెక్

విజయనగరంలో చారిత్రాత్మక మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేతపై ఇటీవల వివాదం జరిగిన సంగతి తెలిసింది. స్థూపాన్ని ప్రభుత్వం అకారణంగా కూల్చివేసిందని టిడిపి విమర్శించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆ స్థూపాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తామని అప్పుడే క్లారిటీ ఇచ్చింది. చెప్పిన విధంగానే అనుకున్న సమయానికే మూడు లాంతర్లను నిర్మించి, టిడిపి ఆరోపణలకు ప్రభుత్వం చెక్ పెట్టింది.

జాతీయోద్యమ నాయకులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్ తదితర విగ్రహాలతో నూతన హంగులతో ఏర్పాటు‌ చేశారు.‌ విజయనగరం సాంస్కృతిక వారసత్వం ఆ స్తంభంలో విరాజిల్లుతోంది. గురజాడ వంటి కవులు, కళాకారుల చిత్రాలు ఆ నిర్మాణంలో ప్రస్ఫటించాయి. ముగ్గురు మహిళలు పట్టుకొని నిల్చున్నట్లు నిర్మాణం చేశారు. ఈ మూడు లాంతర్ల స్తంభం స్థానంలో అక్కడ రూ.5లక్షలతో మూడు లాంతర్లను ఏర్పాటు చేశారు. ఆ రకంగా నూతన మూడు లాంతర్లను ప్రభుత్వం ప్రతిష్ఠించేసరికి, ప్రతిపక్ష టిడిపి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది.

దీనిపై మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు స్పందిస్తూ “మూడు లాంతర్ల స్తూపాన్ని కూల్చేశారంటూ అశోక్‌ గజపతి రాజు గారు, చంద్రబాబు గారు విష ప్రచారం చేశారు. నిజాలు వారివైపు లేనప్పుడు వాళ్లు ఇలానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు అదే మూడులాంతర్ల స్తూపాన్ని తిరిగి అదే ప్రాంతంలో నిలబెట్టాం” అని పేర్కొన్నారు. 

”పూసపాటి వంశం పేరును అశోక్‌ గజపతి రాజు గారు కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారు. వారసత్వపు హక్కుల కోసం పోరాడుతున్న ఒక యువతిపైన తాను దాడిచేయడమే కాదు.. టిడిపితోనూ చేయిస్తున్నారు. అయినా అంతిమంగా గెలిచేది సత్యమే” అని సంచయిత అన్నారు.

విజయనగరంలో చారిత్రక మూడు లాంతర్ల స్థూపం కూల్చివేతపై ఇటీవల వివాదం జరిగిన సంగతి తెలిసింది. స్థూపాన్ని ప్రభుత్వం అకారణంగా కూల్చివేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ స్థూపాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తామని క్లారిటీ ఇచ్చింది.. చెప్పినట్లే చేసింది. మళ్లీ ఆ మూడు లాంతర్ల కొత్త లుక్‌లో ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ సంచయిత గజపతిరాజు తెలియజేస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. టిడిపి విష ప్రచారం చేసిందని మండిపడ్డారు.

మే 23న విజయనగరంలో చారిత్రక మూడు లాంతర్ల స్తంభం కూల్చివేతపై పెద్ద దుమారమే రేగింది. మూడు ప్రధాన రహదారుల కలిసే చోట హరికేన్ లాంతర్ల స్తంభాన్ని ఏర్పాటు చేశారు. స్తంభంపై జాతీయ చిహ్నం మూడు సింహాలు ఉన్నాయి.. రాత్రి సమయంలో ప్రయాణికులకు రోడ్డు కనిపించేందుకు రాజుల కాలంలో మూడు లాంతర్ల స్తంభాన్ని నిర్మించారు. అయితే ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. అందుచేత దాన్ని తీసేసి నూతనంగా ఏర్పాటు‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయింది. అందులో భాగంగానే పాత మూడు లాంతర్ల నిర్మాణాన్ని కుల్చివేశారు.

నాడు ప్రభుత్వం తరపున కూల్చివేసిన కట్టడం స్థానంలో కొత్త చిహ్నాన్ని నిర్మించేందుకు అధికారుల ప్రణాళిక సిద్ధం చేశారని, కూడళ్ల అభివృద్ధిలో భాగంగానే పనులు చేస్తున్నామని, గత వైభవానికి భంగం వాటిల్లకుండా చూస్తామని అధికారులు చెప్పారు. మరోవైపు రాజుల కాలం నాటి కట్టడాన్ని కూల్చివేయడం ప్రతిపక్షాలు విమర్శలు చేశారు.

విజయనగరం చరిత్ర,సంస్కృతికి ప్రతీక అయిన 1869 నాటి మోతీమహల్‌ను పునరుద్ధరించకుండా, మాన్సాస్‌ ఛైర్మన్‌గా ఉండగా బాబాయ్‌ అశోక్‌గజపతిగారు ఎందుకు ధ్వంసంచేశారని సంచయిత ప్రశ్నించారు. దానికి చంద్రబాబు వివరణ ఇవ్వగలరా? అని నిలదీశారు. తాతగారైన పివిజి రాజుగారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

”విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబుగారు, మా బాబాయ్‌ అశోక్‌గజతి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజం ఏంటంటే.. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు” అని సంచయిత స్పష్టం చేశారు. ఓ గదిలో భద్రపరిచిన మూడు లాంతర్ల ఫోటోను కూడా ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

విజయనగర అభివృద్ది పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను తొలగించినట్టు కలెక్టర్ హరిజవహర్ లాల్ వెల్లడించారు. మూడు లాంతర్ల స్థానంలో నూతన నిర్మాణాన్ని చేపట్టి… ఇప్పటి వరకూ ఉన్న నాలుగు సింహాల బొమ్మతో పాటు నూతన లాంతర్లను ఏర్పాటు చేసే దిశగా పలు నమూనాలను సిద్ధం చేశామన్నారు. రానున్న 15 రోజుల్లో ఈ నిర్మాణం పూర్తవుతుందన్నారు.

చెప్పిన విధంగానే మూడు లాంతర్ల నిర్మాణాన్ని‌‌ చేపట్టారు. ఇప్పుడు టిడిపి విమర్శలకు చెక్ పడింది. ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకునే టిడిపి…మూడు లాంతర్ల అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. అందుకే ఎప్పుడు బయటకు రాని అశోక్ గజపతి రాజు రోడ్డుపైకొచ్చి ఆందోళన చేశారు. కాని టిడిపి రాజకీయాలు పారకుండా అనుకున్న సమయానికే మూడు లాంతర్ల నిర్మించి…టిడిపి విమర్శలకు చెక్ పెట్టారు.