Idream media
Idream media
జనవరి 14న సంక్రాంతి. తెలుగువాళ్లు దీన్ని పెద్ద పండుగగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే ఆ సందడే వీరు. రాష్ట్రానికి ఈసారి కాస్త ముందుగానే సంక్రాంతి వచ్చింది. అందరూ ఆనందంగా, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేలా చేస్తోంది. అదే సంక్షేమ సంక్రాంతి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దాదాపు ప్రతీ ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది.. ప్రస్తుతం 3 రోజులుగా ఇళ్ల పట్టాల పంపిణీ ఓ పండగగా కొనసాగుతోంది. లక్షలాది మంది లబ్దిదారులు “పట్ట””రాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. దశాబ్దాల నాటి పేదల కలను జగన ప్రభుత్వం నెరవేరుస్తోంది. అలాగే నేడు రైతులకు కూడా నగదు పంపిణీ జరగనుంది. జనవరి 9న మహిళల ఖాతాల్లో అమ్మ ఒడి పథకం కింద రూ. 15000 నగదు జమ కానుంది. ఇలా వరుసగా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి.
రైతు భరోసా కింద 1,120 కోట్లు..
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. రేపు (మంగళవారం) రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారం చెల్లింపులను ప్రభుత్వం చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత రూ.1,120 కోట్లు చెల్లింపులతో 51.59 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
నివర్ తుపాన్ పరిహారం 646 కోట్లు
నివర్ తుపాన్ కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది. రూ.646 కోట్లు నివర్ పరిహారాన్ని సీఎం వైఎస్ జగన్.. రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాట ప్రకారం తుపాను బాధితులకు పరిహారం అందనుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా తుపాను బాధితులకు వైఎస్ జగన్ ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. ప్రజలు, రైతులకు ముందే సంక్రాంతి సంతోషం కలిగేలా ప్రభుత్వ పథకాలు బాసటగా నిలుస్తున్నాయి.