iDreamPost
android-app
ios-app

పొలిమేరలో కనిపించిన ఈ అమ్మడు.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరూ.

  • Published Nov 04, 2023 | 4:54 PM Updated Updated Nov 06, 2023 | 1:20 PM

హీరోయిన్ అంటే గ్లామరస్ పాత్రల్లోనే కనిపించాలా.. కాదని నిరూపించిందీ ఈ అమ్మడు. చేసిన అన్ని సినిమాల్లోనూ సహజ సిద్ధంగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపించి మెప్పించింది. ఇటీవల మా ఊరి పొలిమేర పార్ట్ 2లో కూడా మెరిసిందీ బ్యూటీ.

హీరోయిన్ అంటే గ్లామరస్ పాత్రల్లోనే కనిపించాలా.. కాదని నిరూపించిందీ ఈ అమ్మడు. చేసిన అన్ని సినిమాల్లోనూ సహజ సిద్ధంగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపించి మెప్పించింది. ఇటీవల మా ఊరి పొలిమేర పార్ట్ 2లో కూడా మెరిసిందీ బ్యూటీ.

  • Published Nov 04, 2023 | 4:54 PMUpdated Nov 06, 2023 | 1:20 PM
పొలిమేరలో కనిపించిన ఈ అమ్మడు.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరూ.

సక్సెస్ మంత్ర..ప్రతి హీరోయిన్ వల్లిస్తున్న పాఠం. విజయం ఉంటేనే హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగగలరు. లేదంటే రెండు, మూడు సినిమాలతో ఇంటి బాట పట్టేస్తుంటారు. అయితే కొంత మంది నటీమణులు.. తమను తాము నిరూపించుకునేందుకు చిన్న చిన్న పాత్రలతోనే మెప్పిస్తుంటారు. అవసరమైతే డీ గ్లామరైజ్డ్ రోల్స్‌లో కూడా నటించేందుకు వెనుకాడరు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటూ ముందుకు సాగుతుంటారు. చాలా మూవీస్‌లో చేశాక కానీ వీరికి గుర్తింపు ఉండదు. ఆమెపై అందరి దృష్టి పడిందంటే.. ఇక స్టార్ స్టేటస్‌కు చేరిపోయినట్లే. ఆ కోవకో వస్తుంది ఈ నటి. చాలా వరకు చిన్న పిక్చర్స్‌లో కనిపించిన ఈ అమ్మడు.. గుర్తిండిపోయే పాత్రలను పోషించింది.

ఆమె మరెవ్వరో కాదూ పదాహారణాల అచ్చ తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్ల. పొలిమేర సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అందులో సత్యం రాజేష్ భార్య లక్ష్మి పాత్రలో కనిపించింది. మర్డర్ మిస్టరీ, చేతబడులు వంటి హార్రర్ నేపథ్యంలో తెరకెక్కించిన పొలిమేర ఓటీటీలో సందడి చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కూడా కామాక్షికి మంచి మార్కులు పడ్డాయి. డాక్టరవ్వ బోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు చాలా మంది యాక్టర్స్. కానీ ఈ అమ్మాయి మాత్రం.. డాక్టరయ్యి.. ఆ తర్వాత యాక్టర్ అవతారం ఎత్తింది. ఆమె సినిమాల జాబితా చూస్తే చాలా ఎక్కువే ఉన్నాయి.

డాక్టర్‌గా కొన్నాళ్ల పాటు చెన్నై అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేసిన కామాక్షి ఆ తర్వాత ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ చేసింది. 2018లో మిస్ ఇండియా తెలంగాణగా ఎంపికైంది. ఆ ఏడాది జరిగిన మిస్ ఇండియా పోటీల్లో కూడా ఫైనల్ వరకు వెళ్లింది. ప్రియురాలు అనే చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన తెలుగు అందం.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2 వంటి చిత్రాల్లో కనిపించింది. అలాగే ఝాన్సీ, సైతాన్ వెబ్ సిరీస్‌ల్లో తనదైన నటనతో మెప్పించింది. కానీ ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం పొలిమేర మూవీనే.

ఇప్పటి వరకు ఆమెను నిండైన చీర కట్టులో మాత్రమే చూశారు ప్రేక్షకులు. కానీ ఆమెలో గ్లామరస్ యాంగిల్ ఇంకా అలాగే ఉంది. వాటిని అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూ ఉంటుంది. ఆమె ఇన్ స్టా ఫోటోలను చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం. బికినీ షోలు, క్లీవేజ్ అందాలతో మతులు పోగొడుతూ ఉంటుంది. ఈ ఫోటోలు చూస్తే.. ఆమె ఈమెనేనా అనుకోవడం ఖాయం. అంతే కాదండోయ్ ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్, సింగర్ కూడా. అడ్వంచర్స్ అంటే ఇష్టపడే ఈ భామ.. ఎవరెస్టు కూడా ఎక్కింది. ఇప్పటి వరకు చూడముచ్చటైన రూపంలో కనిపించిన అమ్మడు.. వెండితెరపై గ్లామరస్ పాత్రల్లో ఎప్పుడు మెరుస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Dr. Sai Kamakshi Bhaskarla (@saikamakshibhaskarla)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş