iDreamPost
హుషారైన తెలుగు సినిమాలు ఈ వారం థియేటర్లు, ఓటీటీలను హోరెత్తించబోతున్నాయి. వీటిలో బజ్ ఉంది జులై 22న రీలిజయ్యే నాగ చైతన్య “థ్యాంక్యూ” (Thank You) సినిమాకే! దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు విక్రమ్ కుమార్. “మనం” తర్వాత రిపీటవుతున్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్ అదే తరహాలో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందన్నది ఇండస్ట్రీ పాజిటీవ్ వైబ్. ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు రాశీ ఖన్నా, మాళవిక అయ్యర్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఆడియో ఇప్పటికే మాంచి బజ్ క్రియేట్ చేసి, ప్లాట్ ఫాం సెట్ చేసింది.

థ్యాంక్యూ (Thank You)

2. షంషేరా (Shamshera)
150 కోట్ల భారీ బడ్జెట్ తో రణ్ బీర్ కపూర్ డబుల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా షంషేరా. 1800ల్లో బ్రిటీష్ పాలకులపై ఓ బందిపోటు తెగ చేసిన తిరుగుబాటే దీని స్టోరీలైన్. యష్ రాజ్ ఫిలిమ్స్ బానర్ లో వస్తున్న ఈ సినిమా అటు హిందీలో, ఇటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇందులో సంజూ భాయ్ విలన్ రోల్ ప్లే చేస్తుండగా, వాణీ కపూర్ హీరోయిన్.
3. దర్జా (Darja)
పుష్పలో దాక్షాయణిగా అదరగొట్టిన అనసూయ భరద్వాజ్ “దర్జా” సినిమాతో తెరమీదకొస్తోంది. సునీల్ మరో ముఖ్య పాత్రధారి. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా జూలై 22న థియేటర్లలోకి వస్తోంది.
4. మహ (Maha)
శింబు, హన్సిక జంటగా వస్తున్న తమిళ్ క్రైం థ్రిల్లర్ “మహ”. ఈ సినిమా తెలుగు వర్షన్ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. యు. ఆర్. జమీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హన్సికకు 50వ సినిమా. ఈ సినిమా మీద హైప్ క్రియేట్ అవుతోంది.
5. హైయ్ ఫైవ్ (Hi Five)
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించి నటిస్తున్న సినిమా హైయ్ ఫైవ్ (Hi Five). థమన్ సంగీతం అందించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ లో మన్నారా చోప్రా, సుధీర్ ఛాయా, జాస్మిన్ తదితరులు నటించారు.
6. జగన్నాటకం (Jagannatakam)
రాజ్ అల్తాడ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమ్ ఎమోషనల్ డ్రామా “జగన్నాటకం”. పార్వతీశం, కుమార స్వామి, స్వాతి మండల్ అర్పితా లోహి నటించిన ఈ సినిమా కూడా జులై 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
7. మీలో ఒకడు (Meelo Okadu)
కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా “మీలో ఒకడు”. జూలై 22న ఈ సినిమా విడుదలవుతోంది. సుమన్ ఇందులో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. హృతికా సింగ్ హీరోయిన్.
OTT Releases:
ఇక OTTకొస్తే.. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన F3 ఈనెల 22 నుంచి సోనీ లివ్ (Sony Liv), NetFlixలలో స్ట్రీమ్ అవనుంది. అలాగే డాక్టర్ అరోరా అనే హిందీ సిరీస్, మీమ్ బాయ్స్ అనే తమిళ్ సిరీస్ కూడా అదే రోజున సోనీ లివ్ లో రిలీజ్ అవుతున్నాయి.
యూత్ ఆఫ్ మే అనే కొరియన్ సిరీస్, ద గ్రే మాన్ తెలుగు వర్షన్ కూడా NetFlixలో రానుంది.
ఇక షణ్ముఖ్ మెయిన్ రోల్ చేస్తున్న ఆహా ఒరిజినల్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ కూడా జూలై 22 నుంచి stream అవుతోంది.
ఇదే రోజున MX Player లో “రుహానియత్” అనే హిందీ సిరీస్ రిలీజవుతోంది. డిస్నీ హాట్ స్టార్ లో పరంపర-2 తెలుగు సిరీస్ జులై 21 నుంచి అలరించబోతోంది.