iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్ కు పెద్ద పండగే

  • Published Mar 07, 2021 | 5:39 AM Updated Updated Mar 07, 2021 | 5:39 AM
మూవీ లవర్స్ కు పెద్ద పండగే

ఈసారి శివరాత్రి పండుగ టాలీవుడ్ కు చాలా ప్రత్యేకం కాబోతోంది. మాములుగా ఈ సీజన్ లో ఒకటి రెండు తప్ప పెద్దగా రిలీజుల మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే అటుఇటుగా పిల్లల పరీక్షలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కానీ ఈసారి సీన్ వేరుగా ఉంది. ఎగ్జామ్స్ కు ఇంకా చాలా టైం ఉండటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. జనం ఎప్పటిలాగే హాళ్లకు వస్తున్నారు. ఉప్పెన చాలా ఈజీగా వంద కోట్ల గ్రాస్ ని చేరుకోవడానికి కారణం ఇదే. జాంబీ రెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మాస్టర్, రెడ్ లాంటి యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు సైతం బయ్యర్లకు లాభాలు ఇవ్వడానికి ఇదే ఊతమిచ్చింది. అందుకే శివరాత్రిని గట్టిగా టార్గెట్ చేశారు మేకర్స్.

ఈ సందర్భంగా రెండు మెగా కానుకలు రాబోతున్నట్టు తెలిసింది. అందులో మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో రూపొందుతున్న సినిమా తాలూకు టైటిల్ రివీల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ లాక్ అయినట్టే. హరిహర వీరమల్లు అనే పేరు గట్టిగా వినిపిస్తోంది. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ బయటికి రాబోతోంది. మణిశర్మ చాలా గ్యాప్ తర్వాత చిరు మూవీకి సంగీతం అందించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ బోయపాటి సినిమా టైటిల్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.

వీటి సంగతలా ఉంచితే ఏకంగా నాలుగు సినిమాలు టికెట్ కౌంటర్ల వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. శర్వానంద్ శ్రీకారం, నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు, శ్రీవిష్ణు గాలి సంపత్ తో పాటు కన్నడ డబ్బింగ్ రాబర్ట్ బరిలో దిగుతున్నాయి. దేనికవే ప్రత్యేకమైన అంచనాలు కలిగి ఉన్నాయి. ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పలేని విధంగా అందరూ గట్టి ప్రమోషన్లు చేస్తున్నారు. దానికి తోడు జాగారం రాత్రి కాబట్టి స్పెషల్ షోల రూపంలో రెవిన్యూ భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాక్ యావరేజ్ గా వచ్చినా చాలు అదనపు షోలతో గల్లాపెట్టెలు నిండిపోతాయి. మరి ఇన్నేసి కానుకల వస్తుంటే మూవీ లవర్స్ కు అంతకన్నా కావలసింది ఏముంటుంది