iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఫస్ట్ మూవీనే స్టార్ హీరోతో చేసింది.. గుర్తు పట్టారా?

  • Published Jan 28, 2024 | 6:37 PM Updated Updated Jan 28, 2024 | 6:37 PM

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లకు కొదవే ఉండదు. ఇలా ఎంతోమంది హీరోయిన్ లు వెండితెరపై వస్తూ పోతూ ఉంటారు. వీరిలో ఎక్కువగా ముంబయికి చెందిన ముద్దుగుమ్మలే ఉంటారు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ మాత్రం అరబ్ దేశం నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇంతకి ఆమె ఎవరో గుర్తుపట్టారా..

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లకు కొదవే ఉండదు. ఇలా ఎంతోమంది హీరోయిన్ లు వెండితెరపై వస్తూ పోతూ ఉంటారు. వీరిలో ఎక్కువగా ముంబయికి చెందిన ముద్దుగుమ్మలే ఉంటారు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ మాత్రం అరబ్ దేశం నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇంతకి ఆమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jan 28, 2024 | 6:37 PMUpdated Jan 28, 2024 | 6:37 PM
ఈ చిన్నారి ఫస్ట్ మూవీనే స్టార్ హీరోతో చేసింది.. గుర్తు పట్టారా?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లకు కొదవే ఉండదు. ఎంతోమంది హీరోయిన్ లు వెండితెరపై వస్తూ పోతూ ఉంటారు. వారిలో చాలామందికి అందం టాలెంట్ ఉన్న అదృష్టం లేక సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమని తాము నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. వారిలో ఎక్కువగా ముంబయికి చెందిన ముద్దుగుమ్మలు ఉండగా.. మరి కొందరు ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన వారు ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ కూడా ఈ కోవకు చెందినదే. పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఒక హీరోయిన్. విచిత్రం ఏమిటంటే ఈ బ్యూటీ అరబ్ దేశం నుంచి సిని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అలాగే ఈమె తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది. అయితే ఆమె నటించిన సినిమాలేవి గుర్తింపు తెచ్చిపెట్టకపోవడంతో.. పూర్తిగా ఇండస్ట్రీకే దూరంమైయ్యింది. ఇంతకి ఆమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున ఈ బ్యూటీ ఒకప్పుడు అబ్బాయిలా కలల రాణి. ఈమె తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది. దీంతో వరుస ఆవకాశాలు ఈ అమ్మాడుకి క్యూ కట్టాయి. ఇంతకి ఈమె ఎవరో గర్తుపట్టారా.. ఆమె పేరు ‘స్నేహా ఉల్లాల్’ . ఈమె అరబ్ దేశం ఒమన్ లో పుట్టి పెరిగింది. అక్కడ తన చదువును పూర్తి చేసి, ఆ తర్వాత తల్లితో కలిసి ముంబయిలో అడుగుపెట్టింది. అలా నటన మీద ఆసక్తితో బాలీవుడ్ లో తన అదృష్టన్నీ పరిక్షించుకుంది. అలా రావడంతోనే నక్క తోక తొక్కిందో ఏమో కానీ, ఏకాంగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘లక్కీ నో టైమ్ ఫర్ లవ్’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయం అందకపోయిన, నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అక్కడ ఆవకాశాలు తగ్గడంతో.. తెలుగు ఇండస్ట్రీలో మకాం మార్చింది.

అలా తెలుగునాట మొదటగా 2007లో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో పాటు ‘కరెంట్’ అనే చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలతో అమ్మాడుకి విపరితమైన క్రేజ్ పెరిగిపోయింది. అసలే స్నేహా చూడటానికి మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ లా పోలి ఉండటంతో.. వరుస ఆవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే.. ‘నేను మీకు తెలుసా’?, ‘సింహా’, ‘అలా మొదలైంది’, ‘మడతా కాజా’, ‘యాక్షన్ త్రీడీ’, ‘అంతా నీ మాయలోనే’ తదితర చిత్రాల్లో నటించగా అవి అంతగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి. దీంతో ఆవకాశాలు తగ్గడంతో ఇప్పుడు స్నేహా మళ్లీ తన సొంత దేశానికి వెళ్లిపోయి తల్లిదండ్రలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. కాగా, ఇప్పటికి స్నేహా కి పెళ్లి చేసుకోకపోవడం గమన్హారం. మరి, ఎంతో క్యూట్ గా ఉన్న స్నేహ చిన్నప్పటి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.