Idream media
Idream media
ఆరోగ్య శాఖకు 11,419.44 కోట్లు
పేదల ఆరోగ్యం పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏ మాత్రం పట్టింపు లేదని టీడీపీ తెగ రాద్దాంతం చేస్తోంది. అందుకే కరోనా కట్టడికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ… విమర్శలు గుప్పిస్తుంది. 5.50 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షల నిర్వహించి దేశంలోనే అంధ్ర ప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిసినప్పటికీ తన పంథా మార్చుకోకుండా అనవసర ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆపద కాలంలో కూడా.. రాజకీయాలే చూశారు గానీ.. ప్రభుత్వానికి ఏనాడూ ప్రజలకు ఉపయోగ పడే కనీస సలహాలు ఇవ్వలేదు. జగన్ మాత్రం రాజకీయాల కన్నా.. ప్రజల ఆరోగ్యమే మిన్నగా భావించి కరోనా కట్టడికి చర్యలు చేపడుతూనే ఉన్నారు.
తాజాగా మంగళవారం శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు రూ. 11, 419. 44 కోట్లు కేటాయించి ప్రజల ఆరోగ్యం పై ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం పరిధిని విస్తరించి… ఇప్పటికే అందుబాటులో ఉన్న 1059 ఆరోగ్య విధానాలతో పాటు… అదనంగా మరో 1000 విధానాలు ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కోటీ 42 లక్షల మందికి పైగా హెల్త్ కార్డులు అందజేయనుంది. మరో ముఖ్యమైన, పేదల ప్రయోజన మై న అంశం ఏమిటంటే… ఏ కారణం చేతనైనా శస్త్ర చికిత్స జరిగితే… సదరు వ్యక్తి కోలు కునే వరకూ… రోజుకు 225 రూపాయల మేరకు శస్త్ర చికిత్స అనంతరం భత్యం ఇచ్చే విధంగా… వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం తెచ్చిన ఘనత జగన్ దే.
రాష్ట్ర సరిహద్దుల్లో నివసిస్తున్న పేద కుటుంబాల అవసరాల కోసం కూడా ఆలోచించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద 130 ఆసుపత్రులను ఎంపిక చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే కంటి వెలుగు పథకం కింద 2020-21 సంవత్సరానికి గాను రూ.20 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించింది. అత్యవసర సేవల నిమిత్తం 108 అంబులెన్స్ పథకం కింద 1000 కొత్త వాహనాలను ఈ ఏడాది ప్రారంభించనున్నారు. 108, 104 సేవలకు గాను రూ.470.29 కోట్లు బడ్జెట్ కేటాయించారు. గ్రామ, వార్డు స్థాయిలో 11000 కు పైగా వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 కొత్త వైద్య కళాశాలను కూడా అందుబాటు లోకి తేనున్నారు. క్యాన్సర్, మూత్ర పిండాల సమస్యల చికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ ఆస్ప త్రులు నిర్మించ నున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు… ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వాటి అవసరాల నిమిత్తం బడ్జెట్ లో ఏకంగా 11, 419.44 కోట్లు ప్రతిపాదించింది జగన్ ప్రభుత్వం. ఆరోగ్య శ్రీ ని ప్రవేశ పెట్టి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల గుండెల్లో నిలిచిపోతే ఆయన వారసత్వం పుచ్చుకున్న జగన్ పేదల ఆరోగ్యం పట్ల ఎనలేని దృష్టి పెడుతూ తండ్రికి మించిన తనయుడిగా పేరు పొందుతున్నారు అనడం అతిశయోక్తి కాదేమో..!