iDreamPost
android-app
ios-app

Netherlands: గ్రౌండ్ లోకి ప్లానింగ్ నోట్స్! నెదర్లాండ్స్ విజయానికి అసలు కారణం!

Netherlands: గ్రౌండ్ లోకి ప్లానింగ్ నోట్స్! నెదర్లాండ్స్ విజయానికి అసలు కారణం!

వన్డే వరల్డ్ కప్ 2023 ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. పసికూనలు అనుకుంటున్న జట్లు సింహాల్లా జూలు విదిలించి గర్జిస్తున్నాయి. ఈ మాటకు నెదర్లాండ్స్ జట్టుని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికాలాంటి జట్టుపై 38 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. నిజానికి సౌత్ ఆఫ్రికాపై 245 పరుగులు నమోదు చేయడం చాలా గొప్ప అని భావిస్తున్న సమయంలో ఆ లక్ష్యాన్ని కాపాడుకుని మ్యాచ్ లో అనూహ్య విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత పసికూన అనే పదాన్ని వాడాలంటే ఒక క్షణం ఆలోచించాల్సిందే.

సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న మ్యాచ్ ఓడిపోవచ్చు, తప్పక ఓడిపోతారు అనుకునే మ్యాచ్ అనూహ్యంగా గెలవచ్చు. నెదర్లాండ్స్- సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఈ కోవకు చెందిందే. సౌత్ ఆఫ్రికాతో నెదర్లాండ్స్ తలపడబోతోంది అనగానే.. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ నెదర్లాండ్స్ ఓడిపోతుంది అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే సౌత్ ఆఫ్రికాకు మాత్రమే కాకుండా.. క్రికెట్ అభిమానులకు కూడా షాకిస్తూ నెదర్లాండ్స్ ఘన విజయం నమోదు చేసింది. నిజానికి చిన్న చిన్న టీమ్ లకు ఈ విజయం ఒక పాఠంలాంటింది. సౌత్ ఆఫ్రికా లాంటి బడా టీమ్ లకు ఇది ఒక గుణపాఠంలాంటింది. అయితే నెదర్లాండ్స్ విజయం అంత తేలిగ్గా వచ్చింది కాదు. ఆ విజయం వెనుక.. ఒక ప్లానింగ్, ఒక విధానం, ఒక ఎగ్జిక్యూషన్ ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం ఏంటంటే.. నెదర్లాండ్స్ జట్టు తమ వ్యూహాన్ని ఒక పేపర్ మీద రాసుకుని మైదానంలోకి తీసుకుని వచ్చింది. ఆ ప్లానింగ్ నోట్స్ కి తగినట్లు తమ ఆటను ఎగ్జిక్యూట్ చేశారు. ఆ విధానంతోనే సౌత్ ఆఫ్రికా జట్టును బోల్తా కొట్టించారు. నిజానికి ఇలాంటి ప్లానింగ్ నోట్స్ అనేవి డక్ వర్త్ లూయిస్ పద్దతి అప్లయ్ చేసిన సమయంలో చూస్తూ ఉంటాం. కానీ, నెదర్లాండ్స్ మాత్రం ఎంతో చక్కగా వ్యూహాలను రాసుకుని.. వాటిని ప్లానింగ్ నోట్స్ పక్కగా అమలు చేసి ఘన విజయం నమోదు చేసింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ జట్టు పసి కూనలు అనుకుంటున్న ఎన్నో జట్లకు ఆదర్శంగా నిలుస్తోంది. క్రికెట్ లో ఇలాంటి పరిణామాలు ఆట మరింత అభివృధి చెందేందుకు దోహదపడతాయి అని చెప్పాలి.

మ్యాచ్ సమురీ చూస్తే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా జట్టు.. నెదర్లాండ్స్ ని కట్టడి చేయలేకపోయింది అని చెప్పాలి. 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ జట్టుని ఆలౌట్ చేయడంలో విఫలం కావడమే కాకుండా.. 64 పరుగుల వరకు మరో వికెట్ తీయలేకపోయారు. ఆ పరుగులే నెదర్లాండ్స్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. బౌలింగ్ లో కూడా నెదర్లాండ్స్ సత్తా చాటింది. 42.5 ఓవర్లకే సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేసి ఔరా అనిపించింది. మరి.. నెదర్లాండ్స్ విజయం వెనుకున్న ప్లానింగ్స్ నోట్స్ ప్రణాళికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి