iDreamPost
android-app
ios-app

ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు… అప్రమత్తం అయినా ప్రపంచ దేశాలు..

ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు… అప్రమత్తం అయినా ప్రపంచ దేశాలు..

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయింది. అమెరికా దళాలు ఉపసంహరణ జరగడంతో  తాలిబన్లు ఉగ్రవాదులు ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు.అఫ్ఘనిస్థాన్‌లోని 19 ప్రావిన్స్ లోని 34 రాష్ట్ర రాజధానులను ఆక్రమించుకున్న తాలిబన్లు ఇవాళ దేశ రాజధాని కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.దీంతో అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజలకు హాని కలిగించవద్దని శాంతియుత వాతావరణంలో అధికారాన్ని మార్పిడి చేస్తామని అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రకటించడంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్‌ల వశమైంది.కాబూల్ నగరాన్ని నాలుగువైపులా చుట్టుముట్టిన తాలిబన్లు శాంతియుతంగా అధికార మార్పిడి జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో సరిహద్దుల్లో ఎదురుచూస్తున్నారు. అధికార మార్పిడి జరుగుతుందని తాత్కాలిక అంతర్గత వ్యవహారాల మంత్రి అబ్దుల్ సత్తార్ మిర్జాక్వాల్ ప్రకటించారు. మరోవైపు అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ఎక్కడ ఉన్నాడో అన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు ముందుకు కదులుతున్నారు.

కొందరు తాలిబన్ ప్రతినిధులు మాత్రమే నగరంలోకి ప్రవేశిస్తారని అధికార మార్పిడి పూర్తయ్యేవరకు శాంతియుతంగా సరిహద్దులలోనే ఎదురు చూస్తామని తాలిబన్లు తెలిపారు.కాబూల్ నగరంలోకి బలవంతంగా చొరబడబోమని రాజధాని నగరం ప్రశాంతంగా, సురక్షితంగా ఉండటమే తమ ప్రాధాన్యమని ప్రకటించారు. కాబూల్‌ జైలుని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు దాదాపు 5000 ఖైదీలను విడుదల చేసారు.

అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో పాటు మంత్రులు కూడా ఎక్కడున్నారో క్లారిటీ లేదు. మంత్రులు పాకిస్థాన్ పారిపోయినట్లు భావిస్తున్నారు.శాంతియుత చర్చల తరువాత ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లకు అప్పగిస్తున్నామని అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వం ప్రకటించింది. అష్రఫ్‌ ఘనీ రాజీనామాతో తాలిబన్ లీడర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సరిహద్దు దేశాల వైఖరి…

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దుశ్చర్యను సరిహద్దు దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే కాబూల్‌లోని అమెరికా ఎంబాసిని ఖాళీచేసినా అమెరికా తమ ఉద్యోగులను,పౌరులను ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది. ఇతర దేశాలు కూడా తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. దాదాపు 1500 భారతీయులను కూడా తరలించేందుకు భారత్ చర్యలు చేపట్టారు.

తాలిబన్ల చర్యను ఖండించిన ప్రపంచం..

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని ఐరాస అధ్యక్షుడు ఆంటోనియో గ్యుటేరస్ తీవ్రంగా ఖండించారు. తాలిబన్ల చర్య వల్ల అంతర్గత యుద్ధం ఏర్పడుతుందని ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని విమర్శించారు. ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టకుడదానని కోరారు.తాలిబన్ల దుశ్చర్యపై ప్రపంచ దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను అక్రమించడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి.సరిహద్దు దేశాలు బోర్డర్ లో సెక్యూరిటీని పెంచాయి.

తాలిబన్ల చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఘటన పరిణామాలు ఎటువైపు వెళ్తాయో,  అమెరికా లాంటి అగ్రదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.