మేము హిందువులం కాదు, ఈ 5 రాష్ట్రాల గిరిజనులకు వేరే మ‌త‌ముందా?

హిందువులంటే ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఇత‌ర మతాల‌కు చెందిన‌వారు త‌ప్ప‌, భార‌త‌దేశంలోని మిగిలిన‌వారంతా హిందువులేన‌ని చెబుతుంటారు. కాని మేం హిందువులం కాదు, మాకు సొంత మత‌ముంది. దాన్ని గుర్తించ‌మ‌ని జార్ఖండ్, ఒడిశా, అస్సాంతో సహా ఐదు రాష్ట్రాలకు చెందిన గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. త‌మ మతాన్ని ‘సర్నా’గా గుర్తించాలని, జనాభా గణనలో త‌మ మ‌తాన్ని కూడా చేర్చాల‌ని వాళ్లు ఉద్య‌మం చేస్తున్నారు. త‌మ దేవతల ఆశీర్వాదం కోరుతూ జంతర్ మంతర్ వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. వీళ్లలో ఎక్కువ‌మంది సంతాలులే.

జూన్ 30, 1855న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిర‌గ‌బ‌డిన‌ సంతాల్ తిరుగుబాటు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆందోళన నిర్వహించారు.


జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ రాష్ట్రాల్లోని 50 జిల్లాల్లోని షెడ్యూల్డ్ తెగలు ప్ర‌భావం ఎక్కువ ఉండే ప్రాంతాల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వం మా మతాన్ని ‘సర్నా’గా గుర్తించాలి. ఈ కేటగిరీ కింద ఆదివాసీలను లెక్కించడానికి రాబోయే జనాభా గణనలో ఒక నిబంధనను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను క‌ల‌సి మా మతాన్ని సర్నాగా గుర్తించమని కోరాలనుకున్నారు.కాని అపాయింట్మెంట్ దొర‌క‌లేదు.


దేశానికి ప్ర‌ధ‌మ పౌరురాలు కాబోతున్న ద్రౌప‌ది ముర్ముకూడా సంతాలుల ఆడ‌ప‌డుచే. అందుకే గురిజ‌న‌లు ఆమె మీద చాలా ఆశ‌లుపెట్టుకున్నారు. ద్రౌప‌ది ముర్ముకూడా గిరిజ‌నుల ప్ర‌త్యేక‌త‌ను నిల‌బెట్ట‌డానికే ప్ర‌య‌త్నిస్తారు.

ఆదివాసీలకు సొంత‌ మతం ఉంది
దేశంలోని గిరిజనులకు వారి స్వంత మతం, మతపరమైన పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. వాటిని మిగిలిన ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం ఇంకా గుర్తించ‌లేదు. వాళ్ల‌ను హిందువుల‌గానే ప‌రిగ‌ణిస్తున్నారు. దానికి గిరిజ‌నులు ఒప్పుకోవ‌డంలేదు. ఆదివాసీలీం.. హిందువులం కాదు, క్రైస్తవులం కాదు. మనకు మన స్వంత జీవన విధానం, మతపరమైన ఆచారాలు, ఆచారాలు, సంస్కృతి, మతపరమైన ఆలోచనలూ ఉన్నాయి, మాది ఇతర మతాలకు భిన్న‌మైన మ‌తం. ప్రకృతిని ఆరాధిస్తాంకాని, విగ్రహాలను కాదు. గిరిజ‌న స‌మాజంలో వర్ణ వ్యవస్థ లేదు. అస‌లు అస‌మాన‌త‌లే లేని మ‌తం మాద‌ని గిరిజ‌న‌లు అంటున్నారు.


భారతదేశంలో 12 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. వారిని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించారు. కాని మ‌తం విష‌యంలో మాత్రం వాళ్ల‌కంటూ ఎలాంటి ప్రత్యేక‌తాలేదు. ఆదివాసి ప్రజలందరూ ప్రకృతిని ఆరాధిస్తారు. మంత్రాలు, తంత్రాలు, పూజా ప‌ద్ధ‌తులూ పెద్ద‌గా ఉండ‌వు. కాని, మతపరమైన ఆలోచనలు, అభ్యాసం, సంస్కృతి , ఆచారాలు మాత్రం భిన్నం. అందుకే ప్ర‌కృతిని ఆరాధించే మా మతాన్ని సర్నాగా గుర్తించాలని గిరిజ‌నులు డిమాండ్ చేస్తున్నారు.

దేశంలోని అన్ని ‘ఆదివాసీ’ల మతానికి సర్వనా అని పేరుపెట్టారు కొంద‌రు. సంతాలీ భాషలో ప్రార్థనా స్థలం అని అర్ధం.

Show comments