Idream media
Idream media
బిగ్‌బాస్-5 విజేత సన్నీ. అతనే గెలుస్తాడని ఎక్కువ మంది అంచనా వేసారు. అవే నిజమయ్యాయి. షన్ముక్ ఆఖరి వరకూ వస్తాడని అనుకోలేదు. కానీ యూట్యూబ్ ఫాలోవర్స్ వల్ల వచ్చాడు. అదే అతని ధైర్యం. అందుకే పెద్దగా అడకుండా సిరి మీద అలగడానికి, సారీ చెప్పడానికి, చెప్పించుకోడానికి టైం వేస్ట్ చేసాడు.
సన్ని ఇంత దూరం వస్తాడని మొదట్లో ఎవరూ అనుకోలేదు. రవి, కాజల్ చాలా గట్టి పోటీదారులు. శ్రీరాం, మానస్ నిబ్బరంగా ఆడితే, రవి, కాజల్ రచ్చ చేయగల ఆటగాళ్లు. వీళ్ల మధ్య సన్నీని ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని సార్లు నోటిని అదుపు చేసుకోక గట్టిగా అరవడం అతనికి మైనస్ అయ్యింది. అయితే రాన్రాను అదే బలంగా మారింది.
హమిదా వెళ్లిపోయిన తరువాత శ్రీరాం ఏదో ఒంటరిగా పాటలు పాడుకోడానికే పరిమితమయ్యాడు. తన జోలికొస్తే అరవడం తప్ప , అందరినీ కలుపుకుని ఆట రక్తి కట్టించలేక పోయాడు. మానస్ కూడా అదే. పింకి ఎపిసోడ్ ఏదో నడిచింది. కానీ, అది పింకీకి మైనస్ అయ్యి ఎలిమినేట్ అయ్యింది. మానస్‌కి ప్లస్ కాలేదు. గట్టిగా యుద్ధం చేసింది రవి, కాజల్. ఎమోషన్స్ లేకుండా ఆటని ఆటగా ఆడారు. కాజల్ ఫైనలిస్ట్‌గా వుంటుందని అనుకున్నారు కానీ, ఆ ప్లేస్ సిరికి దక్కింది.
సిరి గట్టిగా పోటీల్లో వుండేది. సన్ని మీద విరుచుకుపడేది. అయితే షన్ను కోసం ఆడడం వల్ల ప్రేక్షకులు ఒక దశలో చాలా చిరాకుపడ్డారు. ఇద్దరు కనిపిస్తే చాలు, ఇక మొదలైంది హగ్‌లు, సారీలు, అనుకున్నారు. హగ్ తప్పనుకుని ఇప్పుడు ఎవరూ ఆలోచించడం లేదు. అది క్యూట్ దశ దాటి బోర్‌గా మారితేనే బేజారు.
తన బలం కంటే ఇతరుల బలహీనత సన్నీకి కలిసొచ్చింది. ఎవరి గొడవల్లో వాళ్లుండి ప్రేక్షకులకి వినోదం కరువైనప్పుడు సన్నీ వన్ అండ్ ఓన్లీ ఎంటర్‌టైనర్‌గా నిలిచాడు. మనసులో వున్నది మాట్లాడ్డంతో అతను మన పక్కింటి అబ్బాయిలా, గల్లీ బాయ్‌లా కనిపించాడు. ఒక సామాన్య కుటుంబం నుంచి ఇంత దూరం ప్రయాణించడం , తల్లి వచ్చినపుడు ఇద్దరి మధ్య అనుబంధం ఇవన్నీ ఆడియన్స్‌ని దగ్గరికి చేశాయి.
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే చూడక ముందే చాలా మంది సన్నీనే విజేత అనుకున్నారు. అదే అతని నిజమైన గెలుపు.
Also Read : SS Rajamouli : నేషనల్ లెవెల్ లో రాజమౌళి మాస్టర్ ప్లాన్