iDreamPost
android-app
ios-app

Bigg boss ప్రైజ్ మనీపై షాకింగ్ కామెంట్స్.. రూ. 27 లక్షలు వాళ్లే తీసుకున్నారు! VJ సన్నీ

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కు ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ తన విన్నింగ్ ప్రైజ్ మనీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సగానికి సగం డబ్బు వాళ్లే తీసుకున్నారంటూ వెల్లడించారు.

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కు ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ తన విన్నింగ్ ప్రైజ్ మనీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సగానికి సగం డబ్బు వాళ్లే తీసుకున్నారంటూ వెల్లడించారు.

Bigg boss ప్రైజ్ మనీపై షాకింగ్ కామెంట్స్.. రూ. 27 లక్షలు వాళ్లే తీసుకున్నారు! VJ సన్నీ

వరల్డ్ నెంబర్ వన్ తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ ‘ గురించి తెలియని వారు లేరు. వరుసగా ఆరు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ ప్రోగ్రాం. ప్రస్తుతం 7వ సీజన్ ఉల్టా పుల్టా గా సరికొత్త విధానంలో కొనసాగుతుంది. ఈ రియాలిటీ షో లో పాల్గొని ఆట ఆడి గెలిచిన వారికి విన్నింగ్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు ఉంటుంది. దానితో పాటు వారం వారం కంటెస్టెంట్ లకు రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది. అందువలన కంటెస్టెంట్ లు ఈ ఆట ను తమదైన పద్దతిలో ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యి ఫాల్లోవింగ్ ను పెంచుకుంటున్న వారిని చాల మందిని చూశాం. వారిలో ఎక్కువగా పరిచయం అవసరం లేని వ్యక్తి బిగ్ బాస్ సీజన్- 5 విన్నర్ ‘వీజె సన్నీ’. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వీజె సన్నీ తన బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకొచ్చారు.

‘నేను విన్నర్ అయితే కంగ్రాట్యులేట్ నా ఒక్కడికే చెప్పుకోలేదు.. గవర్నమెంట్ కి కూడా చెప్పాను. ఎందుకంటే.. జీఎస్టి ద్వారా నాకంటే ఎక్కువగా.. దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేస్కున్నట్టే మేము. ఆడింది నేను.. గెలిచింది వాళ్ళు అనేలా ఉంది. ఆట నాది ప్రైజ్ మనీ వాళ్ళది. బిగ్ బాస్ విన్నర్ అయినా నాకు రూ.50 లక్షలు ఇవ్వాలి. కానీ, అందులో దాదాపు రూ. 27 లక్షల వరకు ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అంత డబ్బు ట్యాక్స్ రూపంలో తీసేసుకున్నారు. కరెక్ట్ గా ఎంత అనేది గుర్తులేదు కానీ.. దాదాపు సగానికి సగం ట్యాక్స్ ద్వారా తీసేసుకున్నారు.

గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతనే మిగిలిన అమౌంట్ నాకు వచ్చింది. ఛానెల్ వాళ్ళు ట్యాక్స్ రూపంలో ఆ డబ్బు కట్ చేస్కుని మిగిలిన అమౌంట్ నాకు ఇస్తారు. డొనేషన్స్ రూపంలో చాల మంది ట్యాక్స్ ఎగ్గడుతుంటారు కానీ.. మనకన్నీ తెలివితేటలు ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉంటాం. అందుకే మొత్తం అమౌంట్ ట్యాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చింది’. అంటూ సన్నీ తన ప్రైజ్ మనీ గురించి చెప్పుకొచ్చాడు . గవర్నమెంట్ ట్యాక్స్ తో పాటు జి ఎస్ టి కూడా తోడవ్వడంతో ప్రైజ్ మనీ లో ఎక్కువ కట్ అయింది అని ఆయన తెలిపాడు .

ఏదేమైనా బిగ్ బాస్ షో తో ప్రేక్షకుల అభిమానాన్ని , క్రేజ్ ని సంపాదించుకున్న సన్నీ పలు చిత్రాల్లో ఛాన్స్ దక్కించుకుంటున్నాడు . ‘సంజయ్ శేరి’ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సౌండ్ పార్టీ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు . రవి పోలిశెట్టి , మహేంద్ర గజేంద్ర ,శ్రీ శ్యామ్ గజేంద్ర ఈ చిత్ర నిర్మాతలు. ఇటీవల సినిమా పోస్టర్ కూడా విడుదల చేసారు. ‘నవంబర్ 24’ న ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.