iDreamPost

బిగ్ బాస్ షోలో ప్రేమ, ఆపై పెళ్లి! కట్ చేస్తే.. నాలుగేళ్లకే విడాకులు!

బిగ్ బాస్ షోలో ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఓ జంట.. తాజాగా విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలుస్తోంది. పెళ్లైన నాలుగు సంవత్సరాలకే ఆ దంపతులు విడిపోవాలనుకుంటున్నారట. మరి ఆ సెలబ్రిటీ కపులు ఎవరు? ఎందుకు డైవర్స్ కోరుకుంటున్నారు? పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ షోలో ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఓ జంట.. తాజాగా విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలుస్తోంది. పెళ్లైన నాలుగు సంవత్సరాలకే ఆ దంపతులు విడిపోవాలనుకుంటున్నారట. మరి ఆ సెలబ్రిటీ కపులు ఎవరు? ఎందుకు డైవర్స్ కోరుకుంటున్నారు? పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ షోలో ప్రేమ, ఆపై పెళ్లి! కట్ చేస్తే.. నాలుగేళ్లకే విడాకులు!

బిగ్ బాస్ షో ద్వారా పరిచయమైన ఆ ఇద్దరు మెుదట ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది. దాంతో ప్రేమ లోకంలో ఈ జంట విహరించింది. అనంతరం హౌస్ నుంచి బయటకు వచ్చాక 2020 ఫిబ్రవరి 26న ఘనంగా వివాహం చేసుకున్నారు. హనీమూన్ కు నెదర్లాండ్స్ కు కూడా వెళ్లివచ్చారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏమైందో తెలీదు గానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. మరి ఆ సెలబ్రిటీ జంట ఎవరు? పెళ్లైన నాలుగేళ్లకే ఎందుకు విడాకులు తీసుకోబోతున్నారు?

చందన్ శెట్టి-నివేదిత గౌడ.. కన్నడ బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. చందన్ శెట్టి ఈ సీజన్ విజేతగా కూడా నిలిచాడు. వీరిద్దరికి హౌస్ లో ఉన్నప్పుడే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. హౌస్ నుంచి బయటకు రాగానే వివాహ బంధం ద్వారా ఒక్కటైయ్యారు. 2020 ఫిబ్రవరి 26న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు జంటగా ఉండే పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు. దాంతో వీరు కలకాలం కలిసుంటారని అభిమానులు ఆశించారు.

కానీ వారికి ఊహించని షాకిచ్చింది ఈ జంట. తాము విడిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలు, భేదాభిప్రాయాలు రావడం వల్లే ఈ దంపతులు విడాకులకు అప్లై చేసినట్లు అక్కడి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విషయంపై అటు చందన్ శెట్టి గానీ.. ఇటు నివేదిత గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా.. చందన్ శెట్టి రైల్వే చిల్డ్రన్, జోష్ లే, పొగరు, చూ మంతర్ లాంటి కన్నడ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం క్యాండీ క్రష్.. విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ కు గురవుతున్నారు.

Nivedhitha gowda chandan shetty getting devorced

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి