iDreamPost
android-app
ios-app

VJ Sunny: రివ్యూ రైటర్స్ కి వార్నింగ్ ఇచ్చిన VJ సన్నీ! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Updated - 05:10 PM, Tue - 13 June 23
  • Author Soma Sekhar Updated - 05:10 PM, Tue - 13 June 23
VJ Sunny: రివ్యూ రైటర్స్ కి వార్నింగ్ ఇచ్చిన VJ సన్నీ! వీడియో వైరల్..

ఇండస్ట్రీలో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ఆషామాషీ విషయం కాదు. పగలు, రాత్రి వందల మంది కష్టపడితేనే సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలా వచ్చిన సినిమాని థియేటర్లలో చూడకుండానే కొందరు రివ్యూ రైటర్లు రివ్యూలు రాస్తున్నారు అంటూ మండిపడ్డాడు బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ. వీజే సన్ని హీరోగ నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’ ఇటీవలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రానికి రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. తాజాగా జరిగిన మూవీ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు వీజే సన్నీ.

వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘అన్ స్టాపబుల్’ ఈ చిత్రానికి రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా.. రజిత్ రావు నిర్మించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో వీజే సన్నీ సినిమా రివ్యూ రైటర్లపై మండిపడ్డారు. వీజే సన్ని మాట్లాడుతూ..

“ఒక సినిమా తీసి, థియేటర్లలో రిలీజ్ చేయడం అంత ఈజీకాదు. మీరు ఒక సినిమా తీసి రిలీజ్ చేసి అప్పుడు రివ్యూలు రాయండి. అంతేగాని ఏసీ రూమ్స్ లో కూర్చుని రివ్యూలు మాత్రం రాయకండి. సినిమాను నమ్ముకుని చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. ఇండస్ట్రీని మేం అమ్మలా చూస్తాం. మీరు కూడా సినిమాని రివ్యూలు చదివి చూడటానికి రాకండి.మీకు చూడాలి అనిపిస్తే రాండి తప్పితే వాడు రివ్యూ రాశాడు, వీడు రివ్యూ రాశాడు అని రాకండి” అని చెప్పుకొచ్చాడు. ఇక రివ్యూ రాసే వారికి సినిమా గురించి కొంచెం కూడా అవగాహన ఉండదు అని ఈ సందర్భంగా సన్నీ అన్నారు. మీరు పెన్నుతో సమాధానం చెప్పాలని చూస్తే.. మేం మా సినిమాతోనే ఆన్సర్ ఇస్తాం అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వీజే సన్నీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetherkülbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio