HYDలో భారీగా టమాటాల కొరత.. సగం తగ్గిన సరుకు

HYDలో భారీగా టమాటాల కొరత.. సగం తగ్గిన సరుకు

తాజాగా నగరంలో టమాట ధరలు భారీగా కొండెక్కాయి. అంతేకాకుండా టమాట పంట కొరత కూడా భారీగా ఏర్పాడింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ లో కిలో ధర చూస్తే సామాన్యులు మార్కెట్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

తాజాగా నగరంలో టమాట ధరలు భారీగా కొండెక్కాయి. అంతేకాకుండా టమాట పంట కొరత కూడా భారీగా ఏర్పాడింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ లో కిలో ధర చూస్తే సామాన్యులు మార్కెట్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఈ మధ్య సామాన్యలకు ప్రతి విషయంలో భారంగా మారిపోతుంది. ఎందుకంటే.. దేశంలో నిత్యవసర సరుకులు దగ్గర నుంచి దేశంలో నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువుల వరకు అన్నీ ఇలా ధరలు భారీగా పెరుగిపోతున్నాయి. దీంతో మధ్యతరగతి ఇళ్లలో అవసరాలతో పాటు , ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో.. మరోవైపు చికెన్, మటన్ ధరలు పెరుగూ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు వాటితో పాటు ఉల్లి, టమాటా ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేసేది ఎలా అని అందొళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జూన్ నెల ఆరంభం నుంచి ఉల్లిపాయ, టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి.

ముఖ్యంగా నగరంలో అయితే ఈ టమాట ధరలు భారీగా కొండెక్కాయి. దీంతో నగరంలో టమాట పంట సాగు కూడా భారీగా తగ్గిపోయింది. ఇక పంట దిగుబడి బాగా తగ్గిపోవడంతో.. డిమాండ్ కు తగ్గట్టు లేకపోవడంతో రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు రూ.60 నుంచి రూ.70 వరకు పలికిన కిలో టమాట.. నేడు రూ100 రూపాయలు దాటింది. అయితే ఈ రేటు రాబోయే వారం రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నారు. ఇక టమాట ధర భారీగా పెరగడంతో.. ప్రజలు దాన్ని కొనేది ఎలా అంటూ వాపోతున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. సాధారణంగా హైదరాబాద్​ బోయిన్​పల్లి మార్కెట్​కు 5 వేల క్వింటాళ్ల టమాటా మార్కెట్​కు వస్తే కానీ, నగరవాసుల అవసరాలకు సపరిపోదు. కాగా, వచ్చిన టమాటలోనూ 96 శాతం బయట నుంచే వస్తుండగా..  మిగిలిన దాంట్లో  3.34 శాతం మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నది. కానీ, ఇది ఏ మాత్రం సరిపోవడం లేదు.  ఇక 2024, జూన్ 19వ తేదీ నాడు బోయిన్​పల్లి హోల్​సేల్​ మార్కెట్​కు 2 వేల 125 క్వింటాళ్ల టమాట మాత్రమే వచ్చింది. కాగా, ఇందులో తెలంగాణలో పండిన పంట 71 క్వింటాళ్లు మాత్రమే. మిగతా పంట ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అయింది. అయితే ఇందులో వెయ్యి క్వింటాళ్లు ఏపీలోని మదనపల్లి నుంచి వచ్చింది. కానీ, తెలంగాణలోని గజ్వేల్, మేడ్చల్, జహీరాబాద్, తూప్రాన్, వికారాబాద్, శామీర్​పేట్, సిద్దిపేట, భువనగిరి, గద్వాల ప్రాంతాల నుంచి రావాల్సినంత టమాట మాత్రం రావడం లేదు.

అయితే ఎండల ప్రభావంతో టమాట సాగు తగ్గడమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే టమాట కొరత ఏర్పడడంతో బహిరంగ మార్కెట్​లో​ఈ కూరగాయ ధరలు మండిపోతున్నాయి పేర్కొన్నారు. అంతేకాకుండా పంట ఉత్పత్తి తగ్గడంతోనే మిగిలిన కూరగాయల ధరలకు రెక్కుల వచ్చాయి. కాగా, మార్కెట్ లో టమాటా, పచ్చిమిర్చి ధరలు హోల్‌‌‌‌సేల్‌‌‌‌లోనే కిలో రూ.100 వరకు పలుకుతుండగా.. రిటైల్‌‌‌‌గా కిలో రూ.120 వరకు విక్రయిస్తున్నారు. దుంపకూరలు కూడా కిలో రూ.60కి తగ్గడం లేదు. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో.. అసలు సామన్యులు మార్కెట్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు. మరి, నగరంలో టమాట పంట కొరత ఏర్పాడటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments