iDreamPost
android-app
ios-app

జబర్దస్త్‌లో వచ్చే డబ్బులు ఛార్జీలకే సరిపోతాయి.. తల్లి ఆవేదన

జబర్దస్త్‌లో వచ్చే డబ్బులు ఛార్జీలకే సరిపోతాయి.. తల్లి ఆవేదన

బుల్లితెరపై అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్‌. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు షోలు కితకితలు పెడుతున్నాయి. ఈ షోల ద్వారా ఎంతో మంది తమ టాలెంట్ నిరూపించుకుని..ఫేమస్ అయ్యారు. బుల్లితెరపై మెప్పించి.. వెండి తెరపై కూడా రాణిస్తున్నారు చాలా మంది. అయితే పాత నీరు పోయి కొత్త నీరు వస్తున్నట్లు ఈ కామెడీ షోల్లో కూడా చాలా మంది కొత్త కమెడియన్లు వస్తున్నారు. తమ సత్తా చాటుతున్నారు. ఆ కోవకే వస్తారు బుల్లి పిట్ట బ్రదర్స్ పృథ్వీరాజ్, రిషి కుమార్. విభిన్న ప్రతిభావంతులైనప్పటికీ.. తమదైన నటనతో నవ్వులు పువ్వులు పూయిస్తున్నారు. అయితే నవ్వించే ప్రతి పెదవి వెనుక గాయపడ్డ హృదయం ఉంటుందనేది నిజం. తెరపై వీరు హాస్యాన్ని పండిస్తున్నా.. జీవితంలో ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నారు.

వీరి కష్టాల గురించి తల్లి శ్రీలత ఓ ఇంటర్వ్యూలో కన్నీరు మున్నీరు అయ్యారు. వీరు మరుగుజ్జులా ఉంటడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మూడో సారి గర్భం వచ్చినప్పుడు.. ఏం పాపం చేసిందో..ఇలాంటి బిడ్డలు పుట్టారు అంటారని, తీయించుకున్నట్లు పేర్కొన్నారు శ్రీలత. పెద్ద వాడికి 9 సంవత్సరాలు అని, రిషికి 7 ఏళ్లు అని చెప్పారు. భర్త ఆటోడ్రైవర్ అని, రోజుకు రూ. 400 మాత్రమే వస్తాయని, తాను టైలరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అమ్మ యాక్సిడెంట్ జరిగి.. చేయి తీసేశారని, ఆమెను తాను చూసుకుంటున్నానని పేర్కొన్నారు. తమ గురించి తెలిసి, సాయం చేయడానికి వస్తారని కానీ, ఎవ్వరూ ఏమీ చేయరని అన్నారు. ఫోన్లు చేసి అడగాలంటే సిగ్గుగా అనిపించి చేయనన్నారు.

‘జబర్థస్త్‌లో ఇచ్చే డబ్బులు రానూ, పోనూ ఛార్జీలకు సరిపోతుంటాయి. చాలా మంది రైళ్లల్లో జనరల్ కేటగిరీలో పోతే.. మీరంతా హైలెవల్లో ఉండేవాళ్లు.. ఇలా రావడం ఏంటని అంటారు. అప్పుడు చాలా బాధ వేస్తుంటుంది. వీరితో ఫోటోలు తీసుకుంటారు. వీడియో కాల్ చేసి.. మాట్లాడుతుంటారు. అప్పుడు కూడా వీరిని ఇబ్బంది పడేటట్లు చేస్తారు. ఇక్కడకు రావాలంటే 7 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అదీ మాకు కష్టంగా ఉంది. రిషీకి హార్ట్‌లో హోల్ ఉంది. ఆపరేషన్ అయిపోయింది. మూడు నెలలకొకసారి పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యమైన ఫుడ్ పెట్టాలి. ఇటు వచ్చామో బాధపడాలో, సంతోషపడాలో అర్థం కాదు. ఐదేళ్లు కష్టపడ్డాను. జూనియర్ ఆర్టిస్టుగా మూడు నెలలు పని చేశాను. నేను ఏడ్వని రోజూ అంటూ ఉండదు‘ అని  చెప్పారు.

‘పిల్లల కోసం ఆరోగ్యం కోసం అప్పులు చేయగా.. ఇప్పటికీ కూడా ఆ అప్పుల వాళ్లు తిడతారు. నువ్వు షూటింగ్స్ పో, ఎటైనా పో.. మా డబ్బులు మా మొఖాన కొట్టు అంటారు. మాకు 5 లక్షల అప్పు ఉంది. వాటికి వడ్డీలు కడుతున్నాం. వారిద్దరికి ప్రభుత్వం సాయం చేస్తే.. ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆది రూ. 3 వేలు, భాస్కర్ వెయ్యి రూపాయలు, రాకేశ్ బట్టలు కుట్టించారు. వారికి తగ్గ సాయం వారు చేశారు. అలాగే పృధ్వీకి కాళ్లు, చేతులు పట్టేస్తాయి. పుస్తకాలు మోయలేడు. రాయలేడు. రిషి.. అన్నం తిన్నా కక్కేస్తుంటాడు. వీక్ అయిపోతుంటాడు. వీరిద్దరూ ఆయాసపడుతుంటారు. వీరిని చూపించాలంటే డబ్బులు చాలా అవసరం’ అంటూ చెప్పుకొచ్చారు.