iDreamPost
iDreamPost
జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా ఐఏఎస్ అధికారులను ఎల్లోమీడియా రెచ్చగొడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ సంక్షోభంలో ఐఏఎస్ ల జీతాల్లో 60 శాతం కోతం విధించిందట. ఇదే విషయమై ఓ యువ ఐఏఎస్ సహచర ఐఏఎస్ లకు వాట్సప్ సందేశాలను పంపారట. జీతంలో ఒక్కసారిగా 60 శాతం కోత కోస్తే మిగిలిన 40 శాతంతో ఎలా బతకాలి ? అంటూ కొందరు సహచర ఐఏఎస్ లను ప్రశ్నించాడట. పైగా తన నెలవారీ ఖర్చులను, ఆదాయ వ్యయాలను కూడా వివరించాడట. దాంతో అది ఐఏఎస్ లు అందరికీ షేర్ అవటంతో చివరకు సీనియర్ ఐఏఎస్ లు కూడా స్పందించారట. యువ ఐఏఎస్ కు మద్దతుగా అందరూ మాట్లాడారట.
దాంతో విషయం సంఘం అధ్యక్షుడు అభయ త్రిపాఠి దృష్టికి వెళ్ళిందట. సరే తర్వాత అందరూ మాట్లాడుకుని జీతాల్లో కోత విషయమై నిరసన తెలిపేందుకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాలని కూడా డిసైడ్ అయ్యిందంటూ ఎల్లోమీడియా ప్రముఖంగా అచ్చేసింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రభుత్వం జీతాల్లో కోత వేసిందే కానీ పరిస్ధితి సద్దుమణిగిన తర్వాత ఇస్తానని ముందే చెప్పింది. పైగా ఓ మూడు నెలల్లో జీతాల్లో 40 శాతం కోత పడగానే రోడ్డున ఉద్యోగులు రోడ్డున పడతారంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది. మామూలు ఉద్యోగులే సర్దుబాటు చేసుకుంటున్నపుడు ఇక ఐఏఎస్ లాంటి ఉన్నతాధికారులు సర్దుబాటు చేసుకోలేరా ?
సరే వీళ్ళ విషయాన్ని వదిలేస్తే ఇదే ఎల్లోమీడియా కరోనా వైరస్ కారణం చూపుతూ 150 మంది ఉద్యోగులను ఇళ్ళకు పంపేసిందట. అలాగే మిగిలిన ఉద్యోగులకు కూడా వాళ్ళ జీతాల్లో శాస్వతంగా 40 కోత పెట్టేసిందని సమాచారం. మొన్నటి ఏప్రిల్ నెలకు ఇచ్చిన మార్చి జీతంలోనే బేసిక్ లో 40 శాతం కోత విధించటంతో ఉద్యోగులంతా మండిపోతున్నారు. నిజానికి మార్చి నెలలో జీతం కోత పెట్టాల్సిన అవసరం లేదు. అయినా కరోనానే బూచిగా చూపించి యాజమాన్యం ఏకంగా బేసిక్ లో 40 శాతం కోత పెట్టేసిందట. ఇక మెజారిటి మీడియా కూడా ఎవరికందుబాటులో ఉన్న మార్గాల్లో కోతలు పెట్టాయి.
అంటే తన ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టేస్తే మాత్రం పరిస్థితుల ప్రభావం. అదే ప్రభుత్వం ఉద్యోగులకు అందులోను ఐఏఎస్ లకు 60 శాతం కోత విధిస్తే దాన్ని బూతద్దంలో అచ్చేసింది. పైగా ఏపిఎస్ ల జీతాల్లో కోత విధించని ప్రభుత్వం ఏఐఎస్ లకు మాత్రం కోత విధించటమేంటంటూ ప్రభుత్వంపై మండిపోతున్నారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఉద్యోగుల జీతాల్లో కోత కానీ రెండు విడతలుగా చెల్లిస్తామని కానీ ప్రభుత్వం ఎందుకు చెప్పింది ? అనే సోయి లేకుండా ప్రభుత్వంపై ఉద్యోగులను రెచ్చ గొట్టడమే ఎల్లోమీడియా పనిగా పెట్టుకోవటమే విచిత్రంగా ఉంది.