iDreamPost
android-app
ios-app

టీడీపీ “ఆత్మగౌరవ” నినాదం – రాజీవ్ అంజయ్యను అవమానించటం ఏపిసోడ్ ఆ పత్రిక సృష్టేనా ?.

  • Published Sep 01, 2021 | 8:56 AM Updated Updated Sep 01, 2021 | 8:56 AM
టీడీపీ “ఆత్మగౌరవ” నినాదం – రాజీవ్ అంజయ్యను అవమానించటం ఏపిసోడ్  ఆ పత్రిక సృష్టేనా ?.

ఎన్టీఆర్ స్వాభిమాన నినాదం వెనుక కథ ఉద్దేశ్యపూర్వక వక్రీకరణా .

చిన్నపాటి అసహనం వ్యక్తం చేసిన వార్తని అవమానంగా చిత్రీకరించారా .

రాజీవ్ అంజయ్యని అవమానించాడా , ఈనాడు వ్యూహాత్మకంగా కథ అల్లిందా …

తెలుగోడి ఆత్మగౌరవం పేరిట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలకు కారణభూతమైన రాజీవ్ గాంధీ అంజయ్యల వ్యవహారం కూడా ఈనాడు సృష్టేనా . ఈనాడు పత్రికలో సుదీర్ఘ కాలం పని చేసిన సీనియర్ ఎడిటర్ MVR శాస్త్రి కొన్ని ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించిన అంశాలు చూస్తే నాటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు ఎఐసిసి కార్యదర్శి రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అంజయ్యని అవమానించాడు అంటూ రాసుకొచ్చిన సంచలనాత్మక కథనం అవాస్తవం అని తేటతెల్లమవుతోంది …

Also Read:పమిడిఘంటం … మోదేపల్లి నుంచి సుప్రీం కోర్టు వరకు ఎదిగిన తీరు..

1982 లో టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఏఐసీసీ కార్యదర్శి రాజీవ్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రావడం జరిగింది . ఆ సంధర్భంగా అంజయ్య దాదాపు రెండు వందల మంది నాయకులు , కార్యకర్తలతో ఎయిర్పోర్ట్ కి వెళ్లి స్వాగతించారు . అయితే వ్యక్తిగత పర్యటనకు వచ్చిన తనకు ఇంత ఆర్భాటంగా స్వాగత సత్కారాలెందుకు , ఈ దండలు వేయటం ఏంటి , ఈ గోల అంతా ఆపకపోతే తాను వెనక్కి వెళ్లిపోతానని అన్న రాజీవ్ మరికొన్ని పరుష వ్యాఖ్యలతో అంజయ్యని అవమానించి హెలికాఫ్టర్ లో ఒక్కడే తిరుపతి వెళ్ళిపోయాడు అంటూ ఒక వరుస క్రమంలో ఎనిమిది ఫోటోలకు వ్యాఖ్యలు జోడిస్తూ “ఇందిరా కుమారుడు విజయం చేసిన కథా క్రమంబెట్టిదనిన” అనే హెడ్డింగ్ తో ఈనాడులో వచ్చిన వార్త నాడు తెలుగునాట పెనుసంచలనం అయ్యింది.

ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ ఘటన తెలుగువాడి స్వాభిమానం , ఆత్మగౌరవం దెబ్బతీసిన ఘటన ఇది ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీకి , ఢిల్లీ పీఠానికి తెలుగోడి సత్తా రుచి చూపిస్తా అంటూ సినీ హీరో ఎన్టీఆర్ తెలుగుదేశం పేరిట పార్టీ స్థాపించి పలు సభల్లో ఈ అంశం ప్రస్తావిస్తూ తెలుగు ప్రజల ఓట్లు తన వైపుకు తిప్పుకొనే ప్రయత్నంలో విజయం సాధించారు . పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో సాధించిన ఘన విజయానికి గల కారణాల్లో ఈ ఘటన ముఖ్య కారణంగా చెప్పొచ్చు .

సాధారణ వార్తని “వాడుకొని ఆడుకొన్నాం” అంటూ నిజం వెల్లడించిన నాటి ఈనాడు బ్యూరో రిపోర్టర్ MVR శాస్త్రి .

ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నాడు ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవం అంటూ ఎత్తుకొన్న నినాదం వెనక ఉన్న ఈ వార్త మీదే కదా అని ప్రశ్నించగా అందుకు ఉత్సాహంగా స్పందించిన శాస్త్రి మాట్లాడుతూ ఆనాడు ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ లో కేశవులు అనే ఫోటోగ్రాఫర్ దాదాపు నలభై ఫోటోలు తీసాడని ఆ ఫొటోల్లో ఒక ఫొటోతో ఎఐసిసి కార్యదర్శి హోదాలో రాజీవ్ గాంధీ పర్యటన , అంజయ్య స్వాగతించిన వార్తని నాటి సాంప్రదాయ జర్నలిజం ప్రకారం మెయిన్ ఎడిషన్ లో ఒక ఫోటోతో చిన్న బాక్స్ న్యూస్ గా వేద్దామని ప్రిపేర్ అయ్యమని చెప్పిన ఆయన ఆ రోజు వార్తల గురించి రామోజీతో జరిగిన మీటింగ్ తర్వాత ఒక పథకం ప్రకారం ఫోటోలకు కధనాలు అల్లిన వైనం ఆసక్తికరంగా వెల్లడించారు .

Also Read:భారత్ తొలి సైన్యం గురించి తెలుసా ?

నలభై ఫోటోలు పరిశీలించిన రామోజీ ప్రత్యేకంగా హావభావాలు తేడాగా ఉన్న కొన్ని ఫోటోలను ఎంచుకొని ఆయా ఫోటోలకు ఉద్దేశ్యపూర్వకంగా కల్పిత కధనాలు రాయమని ప్రోత్సహించారని అందుకు తగ్గట్టుగా ఎనిమిది ఫోటోలకు అనుగుణంగా చిన్న చిన్న కథనాలు చదివిన వారికి కారం పూసిన విధంగా ఆవేశం చెందేట్టు తానే రాశానని విస్మయపరిచే వాస్తవాన్ని వెల్లడించారు శాస్త్రి .

కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావజాలం ఉన్న రామోజీ ప్రోత్సాహంతో ఒక ఉద్యమంలా వార్తలు సృష్టించారా?.

అదేరోజు రాత్రి పది గంటలకు రామోజీరావు మరో కాంగ్రెస్ నేతతో కలిసి మళ్లీ కార్యాలయానికి వచ్చిన రామోజీ తనతో వచ్చిన కాంగ్రెస్ నేతతో కలిసి ఆ కథనాలను పరిశీలించి ఆ నేతతో సంప్రదించి సంతృప్తి చెందిన తర్వాత పబ్లిష్ చేశామని పెద్ద కథనం లేకుండా ఫోటోలకు తగ్గట్టు ఆవేశం రగిల్చేట్టు రాసిన ఆ కధనాలు నాడు సంచలనం అయ్యాయని ఆ తర్వాత ఇదే ఘటన ఆధారంగా తెలుగోడి ఆత్మగౌరవం అనే నినాదం ఎన్టీఆర్ అందుకొన్నారని అన్యాపదేశంగా వెల్లడించారు .

తెలుగు రాజకీయాల్లో సంచలనాలకు కారణమైన ఈ వార్త ప్రచురణ వెనక జరిగిన సంఘటనలు చూస్తే ఆ తర్వాత కొద్ది కాలానికి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆదరణ రప్పించటం కోసం , స్థానిక నినాదంతో టీడీపీకి విజయం చేకూర్చడం కోసం , కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంపొందించటానికి పత్రికా ధర్మాన్ని మీరి కల్పిత వార్తా కథనాలు వండి వార్చిన రామోజీ తెలుగుదేశం విజయంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పొచ్చు .

Also Read : కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేసేలా ఈనాడు యాజమాన్యం ప్రవర్తించిందా?

కాంగ్రెస్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అల్లిన ఈ కథనాన్ని మరో కాంగ్రెస్ నేతతో కలిసి రాత్రి వేళ వచ్చి పునఃసమీక్ష చేసి ప్రచురణకు అనుమతించిన విషయాన్ని గమనిస్తే కేవలం పత్రికా పరంగా కల్పిత వార్తలతో ప్రజల్ని టీడీపీ వైపు మళ్లించడమే కాక , రాజకీయ సమీకరణాలలో భాగమయ్యి కాంగ్రెస్ , ఇతర పార్టీల నాయకులతో తనకున్న పరిచయాలను , పలుకుబడిని ఉపయోగించి టీడీపీలోకి వలసలను ప్రోత్సహించడంలో , టీడీపీ విజయానికి బాటలు పరవడంలో ఈనాడు పత్రిక , రామోజీ పాత్ర పరిధి ఎంత విస్తృతమైనదో తేటతెల్లమవుతోంది .