Krishna Kowshik
అనేక దేవాలయాల్లో రాత్రి శయన హారతి తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయాన్నే ఆలయం తలుపులు తెరుస్తారు. కానీ యూపీలోని హర్దోయ్‌లో ఓ భక్తుడి కోసం రాత్రి 12 గంటలకు తెరిచి ఉంచారు.. ఎందుకంటే..?
అనేక దేవాలయాల్లో రాత్రి శయన హారతి తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయాన్నే ఆలయం తలుపులు తెరుస్తారు. కానీ యూపీలోని హర్దోయ్‌లో ఓ భక్తుడి కోసం రాత్రి 12 గంటలకు తెరిచి ఉంచారు.. ఎందుకంటే..?
Krishna Kowshik
తమ కోర్కెలు తీర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఉంటాం. తమ లక్ష్యాలను నెరవేర్చాలని, ఆపదల నుండి గట్టెక్కించాలని, ఆర్థిక అవసరాలు తీర్చాలంటూ వేడుకుంటుంటాం. ఇంట్లో పటాలకు పూజలు చేసినా.. మొక్కులు మొక్కుకున్నా.. గుడికి వెళ్లి రెండు చేతులతో నమస్కరిస్తే.. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు దేవాలయంలో కూర్చుంటూ, భగవన్నామ స్మరణ చేస్తే.. ఏదో తెలియని ఆనందం, గుండె భారం తగ్గినట్లు ఉంటుంది. అదే మన ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే.. ప్రత్యేక పూజలు చేస్తూ.. ఆవేదనతో దేవుడికి ప్రార్థనలు చేస్తుంటారు. భక్తుల దర్శనార్థం ఆలయాలు నిత్యం తెరిచి ఉంటాయి.
అయితే రాత్రి వేళ చివరి పూజ అయిపోయాక.. పవళింపు సేవ సమయంలో మాత్రం ఎంత పెద్ద గుడైనా తెరవరు. కానీ ఓ భక్తుడి కోసం అర్థరాత్రి వరకు గుడిని తెరిచారు. తల్లి కోసం మొక్కిన మొక్కు తీర్చుకునేందుకు దేవాలయాన్ని తెరిచి ఉంచేలా చేశాడా కుమారుడు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ లో ప్రసిద్ధ శ్రీ ఖతు శ్యామ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవుడు ఎంతో మహిమ గలవాడు. ఇక్కడ పొద్దున్నే ఆలయం తెరిచి.. రాత్రి 9.30 తర్వాత శయన హారతి అనంతరం తలుపులు మూసేస్తారు. కానీ ఓ వ్యక్తి కోసం 12 గంటల వరకు ఉంచారు. ఓ భక్తుడు తన మొక్కు చెల్లించుకునేందుకు వస్తున్నాడని తెలియడంతో.. ఆలయ పూజారి.. కమిటీతో మాట్లాడి దేవాలయం తెరిచి ఉంచేలా చేసి దర్శన భాగ్యం కల్పించారు.
రాజస్థాన్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి తన మొక్కును చెల్లించేందుకు సాష్టాంగ ప్రదిక్షణలు చేసుకుంటూ శ్రీ ఖతు శ్యామ్ ఆలయానికి చేరుకున్నాడు. అతడి తల్లి గుండె జబ్బుతో బాధపడుతుండటంతో.. ఆమె కోసం శ్రీ ఖతు శ్యామ్ బాబాకు మొక్కుకున్నాడు రాహుల్. తల్లి ఆరోగ్యం మెరుగు పడటంతో తన మొక్కు చెల్లించుకోవాలని భావించి హర్దోయ్‌కు బయలు దేరారు. సాష్టాంగ నమస్కారాలు చేసి.. దేవాలయానికి చేరుకోగా.. రాత్రి 12 గంటల వరకు గుడిని తెరిచి ఉంచేలా సాయం చేశాడు పూజారి. రాహుల్ తో పాటు అతని కుటుంబం మొత్తం దేవాలయాన్ని సందర్శించారు. ఈ దేవుడికి మొక్కకున్నాకే తన తల్లికి నయం అయ్యిందని రాహుల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి మీద కుమారుడికి ప్రేమకు ఫిదా అయిన నెటిజన్లు.. రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.