నైరుతి బుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారమైన వానలు కురుస్తోన్నాయి. గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వానలు పడుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఏపీతో సహా ఆయా రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వానలకు దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు చెప్పింది.
నైరుతి బుతుపవనాల ప్రభావంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. అనుకున్న సమయం కంటే కాస్తా ఆలస్యంగా ప్రవేశించిన ఈ బుతుపవనాలు.. కుండపోత వానలను కురిపిస్తోన్నాయి. ముఖ్యంగా ఆర్థిక రాజధాని అయిన ముంబై వర్షాల ధాటికి అల్లకల్లోలంగా మారింది. పక్కనే ఉన్న థానె సహా మరో 8 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కింద తక్షణ చర్యలను అమలు చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడం, వారికోసం సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏర్పాట్ల కోసం భారీగా నిధులను ఖర్చు చేస్తోన్నాయి. ఇలాంటి విపత్క పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం.. ఏపీతో సహా పలు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర విపత్కర, ప్రకృతి వైపరీత్యలా నివారణ నిధి వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోన్న విషయం అందరికి తెలిసిందే.
ఆ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద తక్షణ చర్యలను చేపట్టడానికి నిధులను మంజూరు చేసింది. విపత్తు నిర్వహణ చర్యల కోసం 19 రాష్ట్రాలకు 6,194.40 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇందులో 4,984.50 కోట్ల రూపాయలను 15 రాష్ట్రాలకు కేటాయించింది. ఈ 15 రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా ఉంది. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, త్రిపుర ఉన్నాయి. మరి.. ఇలాంటి ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో కేంద్రం నిధులు విడుదల చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.