iDreamPost
android-app
ios-app

మార్పుల చక్రవ్యూహం లో తమన్

  • Published Sep 02, 2021 | 10:25 AM Updated Updated Sep 02, 2021 | 10:25 AM
  • Published Sep 02, 2021 | 10:25 AMUpdated Sep 02, 2021 | 10:25 AM
మార్పుల చక్రవ్యూహం లో తమన్

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మీద అక్కినేని అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారో తెలియంది కాదు. బడ్జెట్ కూడా భారీగా సెట్ చేసుకున్నారు. ఖరీదైన విదేశీ లొకేషన్లలో కొన్ని ఎపిసోడ్లు షూట్ చేయబోతున్నారు. ఏజెంట్ కు తమన్ సంగీతం సమకూరుస్తున్న విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలినప్పుడే క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మార్పు ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. తమన్ స్థానంలో హిప్ హాప్ తమిజాను తీసుకునే దిశగా సూరి ఇప్పటికే నిర్మాతకు సూత్రప్రాయంగా చెప్పారట.

కాకపోతే ఇదింకా అఫీషియల్ గా చెప్పలేదు. తమన్ కు ఇటీవలి కాలంలో వరస ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందరు స్టార్లకు తనొక్కడే ఛాయస్ గా మారుతున్నాడు. పవన్ వకీల్ సాబ్ తర్వాత భీమ్లా నాయక్ పట్టేశాడు. చిరంజీవి గాడ్ ఫాదర్ ని తన చేతిలోనే పెట్టారు. బాలకృష్ణ అఖండ ఆల్రెడీ పూర్తి చేశాడు. రామ్ చరణ్ 15 తనకే ఇచ్చారు. తమిళం నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడిగినంత టైం ఇవ్వలేకపోతున్నాడనే కారణంతోనే సురేందర్ రెడ్డి తమన్ ని రీ ప్లేస్ చేయాలని ఆలోచిస్తున్నారట. రామ్ చరణ్ ధృవకు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది తనే. కానీ ఆ స్థాయి అవుట్ ఫుట్ మళ్ళీ ఇవ్వలేకపొతున్నాడు హిప్ హాప్ తమిజా.

తమన్ కు ఇదొక్కటే కాదు టక్ జగదీశ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని దర్శకుడు శివ నిర్వాణ గోపి సుందర్ తో ఇప్పించాడు. దానికి రీజన్ కూడా తమన్ బిజీగా ఉండటమేనట. పెద్ద ప్రోజెక్టుల విషయంలో స్ట్రక్ అవుతున్న తమన్ మీడియం సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందు డిసెంబర్ రిలీజ్ ని ప్లాన్ చేసుకున్న ఏజెంట్ ఇప్పుడు వాయిదా వేసుకోక తప్పదు. ఆలోగా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ చేయడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇకపై తమన్ ఒప్పుకునే టైంలోనే ప్లాన్ చేసుకోవడం బెటరేమో

Also Read : అయిదు సినిమాలు వస్తున్నా నో జోష్

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet