Idream media
Idream media
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన కొన్ని రోజులకే ఉద్దవ్ థాక్రే ఆసక్తికర వాఖ్యలు చేశారు. హిందుత్వ ఎజెండాను వదిలే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన సభ ప్రత్యేక సమావేశంలో ఉద్దవ్ ఈ వాఖ్యలు చేశారు. హిందుత్వం నా ఒంట్లోనే ఉంది, అది నిన్న ఉంది. ఈరోజు ఉంది.. రేపు ఉంటుంది అని ఆయన మాట్లాడారు. కానీ ఎన్సీపి, కాంగ్రెస్, శివసేనల ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో లౌకికవాద సిద్దాంతాలను పాటించాలని పొందుపరిచారు.. దానికి ఆయన సంతకం పెట్టారు. జాతీయ ప్రయోజనాలకు, రాష్ట్ర ప్రయోజనాలకు విలువ ఇస్తామని థాక్రే తెలిపారు.
అయితే గతంలో హిందుత్వ ఎజెండాను పక్కన పెడితేనే కూటమిలో చేరతామని కాంగ్రెస్ ముందే తేల్చిచెప్పింది. శివసేన అందుకు ఒప్పుకునే కూటమిలో చేరి ఉద్దవ్ ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే మళ్లీ ఆయన హిందుత్వాన్ని వదలను అంటూ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన హిందుత్వ పార్టీ అని అందరికీ తెలుసు.. థాక్రే కూడా అలాగే వ్యవహరించినా ఎవరికి నష్టం లేదు.. కానీ సీఎం అయిన కొద్ది రోజులకే ఆయన స్వరం మార్చి మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కూటమిలోని మిత్రపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. దూకుడు స్వభావం ఉన్న శివసేన నాయకులు భవిష్యత్ లో మరెలాంటి వాఖ్యలు చేస్తారో మహావికాస్ అఘాడీ కూటమికి ఎన్ని తలనొప్పులు తెస్తారో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. తృటిలో అధికారం కోల్పోయిన బిజేపి తనకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేదు, కర్నాటకలో వచ్చిన విధంగానే ఇక్కడ కూటమిలో విభేదాలు వస్తే తమకి అనుకూలంగా మార్చుకోవటానికి బిజేపి ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది. దీనికి తగినట్టుగానే ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. నేను సముద్రాన్ని ఎప్పుడైనా తిరిగి వస్తానంటు సాగే ఒక పద్యాన్ని కూడా వినిపించారు.