iDreamPost
android-app
ios-app

జాతీయ స్థాయిలో మనమెక్కడ..?: తెలుగు రాష్ట్రాల విద్యా సంస్థల ర్యాంకులు ఇలా..?

జాతీయ స్థాయిలో మనమెక్కడ..?: తెలుగు రాష్ట్రాల విద్యా సంస్థల ర్యాంకులు ఇలా..?

దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటి మద్రాస్‌ నిలిచింది. దేశంలోని విద్యా సంస్థలకు నేషనల్‌ ఇన్స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)-2020 ర్యాంకులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్డీ) విడుదల చేసింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంహెచ్‌ఆర్డీ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌, సహాయ మంత్రి సంజరు ధోత్రే పది విభాగాలకు ర్యాంకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఆర్డీ ఉన్నత విద్యా అడిషనల్‌ సెక్రటరీ రాకేష్‌ రంజన్‌, యుజిసి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ డి.పి సింగ్‌, ఎఐసిటిఈ చైర్మెన్‌ అనిల్‌ సహస్రబుద్దీ, ఎన్‌బిఎ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కెకె అగర్వాల్‌, ఎన్‌బిఎ సభ్య కార్యదర్శి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ నాసా పాల్గొన్నారు.

అయితే ఈ ర్యాంకులను విద్యాసంస్థలకు ఓవరల్‌, యూనివర్శిటీ, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, కాలేజీ, మెడికల్‌, లా, ఆర్కిటెక్చర్‌, డెంటల్‌ ఇలా పది విభాగాల్లో విడుదల చేశారు.

దేశంలో టాప్ టెన్ విద్యా సంస్థలు

దేశంలో మొత్తం విద్యా సంస్థల్లో ఐఐటి మద్రాస్‌ అగ్రభాగాన నిలిచింది. రెండో ర్యాంకును ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూర్‌, మూడో ర్యాంకును ఐఐటి ఢిల్లీ, నాల్గో ర్యాంకును ఐఐటి ముంబాయి, ఐదో ర్యాంకును ఐఐటి ఖరగ్‌పూర్‌, ఆరో ర్యాంకును కాన్పూర్‌, ఏడు ర్యాంకును ఐఐటి గౌహవతి, ఎనిమిదో ర్యాంకును జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్ యు) న్యూఢిల్లీ, తొమ్మిదో ర్యాంకును ఐఐటి రూర్కీ, పదో ర్యాంకును బెనారస్‌ హిందూ యూని వర్శిటీ (బిహెచ్‌యూ), వారణాసి నిలిచాయి. ఐఐటి హైదరాబాద్‌కు 17వ స్థానంలో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ర్యాంకులు ఇలా..

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఓవరాల్‌ కేటగిరీ ర్యాంకుల్లో(100లోపు) ఏడు విద్యా సంస్థలు, యూనివర్శిటీ కేటగిరీలో ఓవరాల్‌ కేటగిరీ ర్యాంకుల్లో వందలోపు ర్యాంకుల్లో 9 సంస్థలు నిలిచాయి. ఇంజినీరింగ్‌ కేటగిరీలో 200 ర్యాంకులు ప్రకటించగా.. 25 విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాలవే కావడం విశేషం.

మేనేజ్‌మెంట్‌ కేటగిరీలో నాలుగు, ఫార్మసీ విద్యాసంస్థల కేటగిరీలో ఏడు చోటు సంపాదించుకోగా.. కళాశాలల కేటగిరీలో వందలోపు కేవలం రెండు కళాశాలలే చోటు దక్కించుకున్నాయి. వైద్య కళాశాలల కేటగిరీలో, న్యాయవిద్య, ఆర్కిటెక్చర్, దంత వైద్య విద్య కేటగిరీల్లో ఒక్కో కళాశాల చొప్పున ర్యాంకు దక్కించుకున్నాయి.

ఓవరాల్‌ కేటగిరీ ర్యాంకులు

1. యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (15)    
2. ఐఐటీ–హైదరాబాద్‌ ( 17)
3. ఆంధ్రా యూనివర్శిటీ (36)
4. ఎన్‌ఐటీ వరంగల్‌ (46)
5. ఉస్మానియా యూనివర్శిటీ (53)
6. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (68)
7. కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ (70)

యూనివర్శిటీ కేటగిరీలో
               
1. యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ( 6)
2. ఆంధ్రా యూనివర్శిటీ (19)
3. ఉస్మానియా యూనివర్శిటీ (29)
4. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (38)
5. కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ (41)
6. గాంధీ ఇని. ఆఫ్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ (71)
7. శ్రీసత్యసాయి ఇని. ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ (75) 8. ఐఐఐటీ, హైదరాబాద్‌ (78)
9. విజ్ఞాన్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్, టెక్, రీసెర్చ్‌(100)

ఇంజినీరింగ్‌ కేటగిరీలో

1. ఐఐటీ–హైదరాబాద్‌ (8)
2. ఎన్‌ఐటీ–వరంగల్‌ (19)
3. ఐఐఐటీ–హైదరాబాద్‌ (43)
4. జెఎన్టీయు–హైదరాబాద్‌ (57)
5. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషనన్ (58)
6. కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌(ఏ), విశాఖపట్నం(69)
7. యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ హైదరాబాద్‌ (88)
8. యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజి, కాకినాడ (97)
9. విజ్ఞాన్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్, టెక్, రీసెర్చ్‌(118)
10. సిబిఐటి, హైదరాబాద్‌ (124)
11. విఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి (127)
12. సివిఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (141)
13. వర్ధమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (143)
14. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (153)                15. వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ (156)
16. ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్, వరంగల్ (160)
17. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ (170)
18. గోకరాజు రంగరాజు, హైదరాబాద్‌ (172)
19. అనురాగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (180)
20. శ్రీ విద్యానికేతన్‌ ఇంజినీరింగ్ (184)
21. జెఎన్టీయుఎ, అనంతపురం (185)
22. వాసవీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, హైదరాబాద్‌ (187)
23. గాయత్రీ విద్యాపరిషత్, విశాఖ (188)
24. జి.పుల్లారెడ్డి, కర్నూలు (190)
25. బివిఆర్‌ఐటి (199)

మేనేజ్‌మెంట్‌ కేటగిరీలో

1. ఇక్ఫాయ్‌ ఫౌండేషన్, హైదరాబాద్ (25)
2. ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్, తిరుపతి (53)
3. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ (61)
4. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (70)

ఫార్మసీ కేటగిరీలో 

1. నైపర్, హైదరాబాద్‌ (5)
2. ఎయు కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మా, విశాఖ (34)
3. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (42)
4. చలపతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మా, గుంటూరు (54)
5. రాఘవేంద్ర ఇని. ఆఫ్‌ ఫార్మా, అనంతపురం(55)
6. ఆచార్య నాగార్జున వర్శిటీ కాలేజ్‌ (64)
7. ఎస్వీ కాలే జ్‌ ఆఫ్‌ ఫార్మసీ, చిత్తూరు (69)

కళాశాలల కేటగిరీలో

1. ఆంధ్ర లయోలా కాలేజ్, విజయవాడ (36)
2. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్, హైదరాబాద్‌ (73)

వైద్య కళాశాలల కేటగిరీలో

1. శ్రీవెంకటేశ్వర ఇని. ఆఫ్‌ మెడికల్‌ సైన్సైస్, తిరుపతి (38)

న్యాయ విద్య కేటగిరీలో

1.నల్సార్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లా (3)

ఆర్కిటెక్చర్‌ కేటగిరీలో

1.స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కి, విజయవాడ (9)

దంత వైద్య విద్య కేటగిరీలో

1. ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌సైన్సెస్, సికింద్రాబాద్‌ (23)  ర్యాంకులను ఆయా విభాగాల్లో తెలుగు రాష్ట్రాల విద్యా సంస్థలు సొంతం చేసుకున్నాయి.

జాతీయ స్థాయిలో యూనివర్శిటీ విభాగం

1. ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూర్‌
2. జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, న్యూఢిల్లీ
3. బెనారస్‌ హిందూ యూనివర్శిటీ, వారణాసి
4. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్‌
5. జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ, కలకత్తా
6. యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
7. కలకత్తా యూనివర్శిటీ, కలకత్తా
8. మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, మణిపాల్‌
9. సావిత్రిబాయి ఫులే పూణే యూనివర్శిటీ, పూణే
10. జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ, న్యూఢిల్లీ

ఇంజినీరింగ్‌ కేటగిరీ

1. ఐఐటీ–మద్రాస్‌         
2. ఐఐటీ–ఢిల్లీ     
3. ఐఐటీ–బాంబే       
4. ఐఐటీ–కాన్పూర్‌   
5. ఐఐటీ–ఖరగ్‌పూర్‌         
6. ఐఐటీ–రూర్కీ
7. ఐఐటీ–గౌహతి   
8. ఐఐటీ–హైదరాబాద్‌   
9. ఐఐటీ–తిరుచిరాపల్లి 
10. ఐఐటీ–ఇండోర్‌       

మేనేజ్‌మెంట్‌ కేటగిరీ

1. ఐఐఎం–అహ్మదాబాద్‌                   
 2. ఐఐఎం–బెంగళూరు     
3. ఐఐఎం–కలకత్తా       
4. ఐఐఎం–లక్నో
5. ఐఐటీ–ఖరగ్‌పూర్‌           
6. ఐఐఎం–కోజికోడ్‌               
7. ఐఐఎం–ఇండోర్‌     
8. ఐఐటీ–ఢిల్లీ             
9. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ           
10. మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌(గురుగ్రామ్‌)

కళాశాలల కేటగిరీ

1. మిరండా హౌజ్‌ , ఢిల్లీ  
2. లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్, న్యూఢిల్లీ 
3. హిందూ కాలేజ్, ఢిల్లీ 
4. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్, ఢిల్లీ
5. ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై
6. లయోలా కాలేజ్, చెన్నై           
7. సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్, కోల్‌కతా
8. రామకృష్ణ మిషన్‌ విద్యామందిర, హౌరా 
9. హన్స్‌రాజ్‌ కాలేజ్, ఢిల్లీ   
10. పీఎస్‌జీఆర్‌ కృష్ణమ్మల్‌ ఫర్‌ విమెన్, కోయంబత్తూర్‌ 

ఫార్మసీ కేటగిరీ

1. జామియా హమ్‌దర్ద్, న్యూఢిల్లీ 
2. పంజాబ్‌ యూనివర్శిటీ, చంఢీగఢ్‌
3. నైపర్, మోహలీ   
4. ఐసీటీ, ముంబై             
5. నైపర్, హైదరాబాద్‌     
6. బిట్స్, పిలానీ       
7. మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మా సైన్సైస్, ఉడిపి  
8. నైపర్, అహ్మదాబాద్‌   
9. జేఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, ఊటీ 
10. జేఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, మైసూర్

మెడికల్‌ కేటగిరీ

1. ఎయిమ్స్, న్యూఢిల్లీ 
2. పీజీఐఎంఈఆర్, చంఢీగఢ్‌
3. క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్, వెల్లూర్‌

ఆర్కిటెక్చర్‌ కేటగిరీ

1. ఐఐటీ, ఖరగ్‌పూర్‌         
2. ఐఐటీ, రూర్కీ   
3. ఎన్‌ఐటీ, కాలికట్‌       

లా విభాగం

1. నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్శిటీ, బెంగళూర్‌
2. నేషనల్‌ లా యూనివర్శిటీ, న్యూఢిల్లీ
3. నల్సర్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌.

దంత విద్య కేటగిరీ

1. మౌలానా ఆజాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, ఢిల్లీ
2. మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, ఉడిపి 
3. డాక్టర్‌ డీవై పాటిల్‌ విద్యాపీఠం, పూణే