iDreamPost
android-app
ios-app

తమిళ హీరోని పెళ్లాడిన తెలుగు హీరోయిన్..

  • Published Jun 17, 2022 | 6:51 PM Updated Updated Jun 17, 2022 | 6:51 PM
తమిళ హీరోని పెళ్లాడిన తెలుగు హీరోయిన్..

ఇటీవలే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకుంది. తాజాగా మరో హీరోయిన్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన కితకితలు సినిమాలో రెండో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి మధుశాలిని. ఆ తర్వాత ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్, వాడు-వీడు, గోపాల గోపాల… లాంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవలే ‘9 అవర్స్‌’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులని పలకరించింది మధుశాలిని.

తాజాగా ఈ తెలుగమ్మాయి తమిళ హీరోని వివాహం చేసుకుంది. పలు తమిళ సినిమాలు, సిరీస్ లలో నటించిన తమిళ హీరో గోకుల్‌ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరిగింది.

తమ వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మధుశాలిని. తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్‌ కలిసి నటించారు. ఆ మూవీ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇప్పుడు ఇలా పెళ్లి పీటలెక్కారు.

View this post on Instagram

A post shared by Madhu Shalini (@iammadhushalini)