మళ్ళీ మొదలైన డబ్బింగ్ హవా

అంతకు ముందు కూడా హిట్లున్నాయి కానీ మార్కెట్ స్టామినా పెరిగింది మాత్రం వీటి నుంచే. కానీ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని మెప్పించేలా అనువాద చిత్రాలు రాకపోవడంతో మెల్లగా డౌన్ అవ్వడం మొదలయ్యింది. ఒకప్పుడు వెలిగిన విక్రమ్, కార్తీ లాంటి స్టార్ల బిజినెస్ డబుల్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయింది.

అంతకు ముందు కూడా హిట్లున్నాయి కానీ మార్కెట్ స్టామినా పెరిగింది మాత్రం వీటి నుంచే. కానీ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని మెప్పించేలా అనువాద చిత్రాలు రాకపోవడంతో మెల్లగా డౌన్ అవ్వడం మొదలయ్యింది. ఒకప్పుడు వెలిగిన విక్రమ్, కార్తీ లాంటి స్టార్ల బిజినెస్ డబుల్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయింది.

ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాలు రాజ్యమేలాయి. అర్జున్ జెంటిల్ మెన్ తో మొదలుపెట్టి సూర్య గజినీ దాకా వసూళ్ల వర్షం కురిపించినవి చాలానే ఉన్నాయి.అంతకు ముందు కూడా హిట్లున్నాయి కానీ మార్కెట్ స్టామినా పెరిగింది మాత్రం వీటి నుంచే. కానీ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని మెప్పించేలా అనువాద చిత్రాలు రాకపోవడంతో మెల్లగా డౌన్ అవ్వడం మొదలయ్యింది. ఒకప్పుడు వెలిగిన విక్రమ్, కార్తీ లాంటి స్టార్ల బిజినెస్ డబుల్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయింది. రజనీకాంత్ కే ఈ పరిస్థితి తప్పలేదు. రోబో నుంచి పెద్దన్న దాకా ఆయన రేంజ్లో వచ్చిన మార్పులు చూస్తే ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.


కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే మళ్ళీ ఇవి ట్రాక్ లో పడుతున్నాయి. గత నెల విక్రమ్ సాధించిన బ్లాక్ బస్టర్ వైబ్రేషన్స్ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కేవలం ఆరు కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేస్తే పది కోట్లకు దగ్గరగా లాభాలు ఇచ్చింది. తాజాగా విక్రాంత్ రోనా కూడా అదే బాట పట్టింది. మరీ కమల్ మూవీ అంత సెన్సేషన్ కాదు కానీ తక్కువ ధరకు అమ్మిన నిర్మాతల ఎత్తుగడ డిస్ట్రిబ్యూటర్లకు వరంగా మారింది. కోటిన్నరలోపు అమ్మితే రామారావు డిజాస్టర్ పుణ్యమాని నాలుగు రోజులకే రెండు కోట్ల ఎనభై లక్షలు దాటేసి హిట్టు మార్కు దాటేసింది. కెజిఎఫ్ చాప్టర్ 2 మన డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు కనక వర్షం కురిపించడం మర్చిపోకూడదు

తక్కువకు అమ్మి ఎక్కువ లాభాలు చేసుకో సూత్రాన్ని ఇప్పటి డబ్బింగ్ సినిమాలు బాగా పాటిస్తున్నాయి. ఒకవేళ ఇదే విక్రాంత్ రోనా ఏ అయిదు కోట్లకో అమ్ముంటే ఖచ్చితంగా రిస్క్ లో పడేది. సుదీప్ మార్కెట్ పరిమితిని దృష్టిలో పెట్టుకుని తెలుగు వెర్షన్ ని బోనస్ గా భావించడం వల్లే ప్రాఫిట్స్ వచ్చాయి. కన్నడలో రిలీజ్ కు ముందే ఇది సేఫ్ వెంచర్ అయిపోయింది. ఇక రాబోయే వాటికి కూడా ఇదే తరహా స్ట్రాటజీ అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. బీస్ట్ ఎంత డిజాస్టర్ అయినా తీవ్ర నష్టాలు మిగల్చలేదు. శివకార్తికేయన్ డాన్ ఈజీగా పెట్టుబడిని వెనక్కు తెచ్చేసింది. రాబోయే పొన్నియన్ సెల్వన్ మీద కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి

Show comments