iDreamPost
android-app
ios-app

‘తంగాలన్‌’ బిగ్‌ సీక్రెట్‌ బయటపెట్టిన విక్రమ్‌!

  • Published Nov 02, 2023 | 10:30 AM Updated Updated Dec 18, 2023 | 5:42 PM

టీజర్‌లో విక్రమ్‌ యాక్షన్‌ మామూలుగా లేదు. ఇక, ఈ సినిమాకు సంబంధించి విక్రమ్‌ ఓ బిగ్‌ సీక్రెట్‌ను బయటపెట్టారు. తంగాలన్‌లో ఆయన పాత్ర ఎలాంటిదో విడుదలకు

టీజర్‌లో విక్రమ్‌ యాక్షన్‌ మామూలుగా లేదు. ఇక, ఈ సినిమాకు సంబంధించి విక్రమ్‌ ఓ బిగ్‌ సీక్రెట్‌ను బయటపెట్టారు. తంగాలన్‌లో ఆయన పాత్ర ఎలాంటిదో విడుదలకు

  • Published Nov 02, 2023 | 10:30 AMUpdated Dec 18, 2023 | 5:42 PM
‘తంగాలన్‌’ బిగ్‌ సీక్రెట్‌ బయటపెట్టిన విక్రమ్‌!

విలక్షణ నటుడు విక్రమ్‌ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కేవలం ఆయన నటనతో హిట్లు అయిన సినిమాలు కూడా ఉన్నాయి. విక్రమ ‘ శివపుత్రుడు’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సినిమాలో ఆయన నటన చూసి ఫిదా అవ్వని వారుండరంటే.. అతిశయోక్తి కాదు. నాన్న, ఐ సినిమాల్లో కూడా అత్యాద్భుతమైన నటనను ప్రదర్శించారు. విక్రమ్‌ తాజా చిత్రం ‘తంగాలన్‌’లో.. నటనలో పీక్స్‌ చూపించబోతున్నారని బుధవారం రిలీజ్‌ అయిన టీజర్‌ను బట్టి తెలుస్తోంది.

టీజర్‌లో విక్రమ్‌ యాక్షన్‌ మామూలుగా లేదు. ఇక, ఈ సినిమాకు సంబంధించి విక్రమ్‌ ఓ బిగ్‌ సీక్రెట్‌ను బయటపెట్టారు. తంగాలన్‌లో ఆయన పాత్ర ఎలాంటిదో విడుదలకు ముందే చెప్పేశారు. ఈ సినిమాలో ఆయనకు ఎలాంటి డైలాగ్స్‌ ఉండవట. మాటలతో కాకుండా చేతలతో సినిమాను ముందుకు నడపనున్నారట. తంగాలన్‌లో ఆయన పాత్ర కొద్ది అటు ఇటుగా.. శివపుత్రుడు పాత్రను పోలి ఉంటుందట. శివ పుత్రుడు సినిమాలో ఆయన మాట్లాడకుండా..

కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో వ్వావ్‌ అనిపించారు. కాగా, ‘తంగాలన్‌’ సినిమాకు పా రంజిత్‌ దర్శకత్వం వహించారు. మాళవిక మోహన్‌, పార్వతీ తిరువెత్తు, డేనియల్‌ కాల్తగిరోన్‌, హరి క్రిష్ణన్‌, ముత్తు కుమార్‌, పశుపతిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2024, జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, తంగాలన్‌ సినిమా గురించి విక్రమ్‌ బయటపెట్టిన బిగ్‌ సీక్రెట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom