iDreamPost
android-app
ios-app

తెలుగు రేసర్ సందీప్ నడింపల్లికి ప్రమాదం.. దీపావళి వేడుకల్లో..!

తెలుగు బైక్ రేసర్ సందీప్ నడింపల్లికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో కూడా సందీప్ కు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సందీప్ నడింపల్లి పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

తెలుగు బైక్ రేసర్ సందీప్ నడింపల్లికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో కూడా సందీప్ కు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సందీప్ నడింపల్లి పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

తెలుగు రేసర్ సందీప్ నడింపల్లికి ప్రమాదం.. దీపావళి వేడుకల్లో..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కుర్రాడు, బైక్ రేసర్ సందీప్ నడింపల్లికి మంచి గుర్తింపు ఉంది. ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే బైక్ రేసింగ్ లో జాతీయస్థాయి పతకాలను సాధించాడు. నేషనల్ ఛాంపియన్ కూడా అయ్యాడు. జాతీయస్థాయిలో 6 పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ని రిప్రెసెంట్ చేస్తున్నాడు. అయితే సందీప్ నడింపల్లికి ప్రమాదం జరిగింది. దీపావళి వేడుకల్లో సందీప్ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి శోభ వెల్లివిరిసింది. చిన్నా పెద్ద అంతా కూడా టపాసులు కాల్చుకుంటా దీపావళిని ఆనందంగా జరుపుకున్నారు. అయితే దీపావళి అంటే ఆనందం ఎలా ఉంటుందో.. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక పరిస్థితే బైక్ రేసర్ సందీప్ నడింపల్లికి ఎదురైంది. దీపావళి సందర్భంగా సందీప్ వర్మ నడింపల్లి కూడా టపాసులు కాల్చాడు. అయితే ఆ సమయంలోనే ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తాను టపాసులు కాలుస్తన్న వీడియోలు స్టోరీగా పెట్టాడు. సీమటపాకాయల దండను చేత్తో పట్టుకుని కాలుస్తూ కనిపించాడు. అలాగే భూచక్రాన్ని చేత్తో పట్టుకుని వెలిగించి ఆ తర్వాత నేలపై వేశాడు. ఆ తర్వాత కాసేపటికి యశోధ ఆస్పత్రికి వెళ్లినట్లు మరో స్టోరీ పెట్టాడు. అందులో చేతికి కట్టు వేసి ఉంది.

అలాగే అతను ఆస్పత్రి బెడ్ పై ఉన్న పిక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా టపాసులు కాలుస్తున్న సమయంలోనే గాయపడినట్లు తెలుస్తోంది. అయితే చిన్న గాయాలలాగానే కనిపించింది. సందీప్ అయితే పిక్స్ లో నార్మల్ గానే ఉన్నాడు. కాలిన గాయాలు కాబట్టి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దీపావళి అంటే ఆనందం మాత్రమే కాదు.. జాగ్రత్త కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే. టపాసులతో వ్యవహారం కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలెే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ దీపావళి అనే కాదు.. ఏ సంవత్సరం అయినా కూడా టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. కాటన్ దుస్తులు ధరించండి, కాళ్లకు చెప్పులు వేసుకోండి. టపాసులను దూరంగా ఉండి మాత్రమే కాల్చండి.

 

View this post on Instagram

 

A post shared by SANDEEP VARMA NADIMPALLI 🇮🇳 (@sandeep_nadimpalli)