iDreamPost
iDreamPost
బీజేపీకి టీఆర్ ఎస్ కి మధ్య రాజకీయ నినాదంగా మారుతున్న అంశంపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారత దేశంలో విలీనం అయ్యింది. ఈ తేదీపై రాజకీయంగానూ చర్చ నడుస్తోంది. ఈ తేదీని విమోచన దినంగా ప్రకటించాలని బీజేపీ ఒత్తిడితెస్తోంది. దానికి కేసీఆర్ మరో ఎత్తు వేశారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ అంతటా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా తీర్మానించింది. ప్రజాస్వామిక వ్యవస్థలోకి హైదరాబాద్ సంస్థానం అడుగుపెట్టి 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాలు అవుతున్నాయి.