Idream media
Idream media
తెలంగాణలో రేపటి నుంచి మద్యం అమ్మకాలకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మద్యం దుకాణాలు తెరవాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్గఢ్ రాష్ట్రాలు మద్యం దుకాణాలను నిన్నటి నుంచి తెరిచాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండటంతో పాటు గుడుంబా మళ్లీ తయారవుతుందని.. వాటిని అరికట్టేందుకు మద్యం దుకాణాలను తెరవాల్సి వస్తుందని చెప్పారు.
మద్యం ధరలు సరాసరి 16 శాతం మేర పెంచుతున్నట్లు చెప్పారు. పెంచిన ధరలు మళ్ళీ తగ్గించబోమన్నారు. తెలంగాణలో 2,200 దుకాణాలు ఉండగా కంటోన్మెంట్ జోన్ లో ఉండే 15 దుకాణాలు మినహా అన్ని దుకాణాలను తెరుస్తామని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. దుకాణాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించని దుకాణాల లైసెన్సు వెంటనే రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.